ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్ | Sakshi
Sakshi News home page

This Week OTT Release Movies: ఓటీటీల్లోకి ఒకే వారంలో 32 మూవీస్.. ఆ రెండు స్పెషల్

Published Sun, Oct 29 2023 11:41 PM

Telugu Movies OTT Release On November 1st Week 2023 - Sakshi

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో తరుణ్ భాస్కర్ 'కీడా కోలా'తో పాటు పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటి సంగతి పక్కనబెడితే ఓటీటీల్లో మాత్రం బోలెడన్ని కొత్తకొత్తగా మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే వీటిలో పలు తెలుగు స్ట‍్రెయిట్ చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయండోయ్. వాటిలో కొన్ని మాత్రం స్పెషల్ అని చెప్పొచ్చు.

ఈ వారం థియేటర్లలో వచ్చే సినిమాల సంగతి పక్కనబెడితే వివిధ ఓటీటీల్లో ఓవరాల్‌గా 32 సినిమాలు-వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. వీటిలో షారుక్ 'జవాన్', రామ్ 'స్కంద' చిత్రాలతో పాటు ఆర్య, స్కామ్ 2003 సిరీసులు కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని ఇంగ్లీష్, హిందీ సినిమాలు, సిరీసులు ఉన్నాయి. ఇంతకీ ఇవన్నీ ఏయే ఓటీటీల్లో ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్)

OTTల్లో ఈ వారం విడుదలయ్యే మూవీస్-వెబ్ సిరీసులు (అక్టోబరు 31- నవంబరు 5)

నెట్‌ఫ్లిక్స్

 • లాక్డ్ ఇన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 01
 • న్వువో ఒలింపో (ఇటాలియన్ సినిమా) - నవంబరు 01
 • వింగ్ ఉమెన్ (ఫ్రెంచ్ చిత్రం) - నవంబరు 01
 • ఆల్ ద లైట్ వుయ్ కాంట్ సీ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 02
 • సిగరెట్ గర్ల్ (ఇండోనేసియన్ సిరీస్) - నవంబరు 02
 • హిగ్యుటా: ద వే ఆఫ్ ద స్కార్పియన్ (స్పానిష్ సినిమా) - నవంబరు 02
 • జవాన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 02
 • ఒనిముషా (జపనీస్ సిరీస్) - నవంబరు 02
 • యూనికార్న్ అకాడమీ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 02
 • బ్లూ ఐ సమురాయ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 03
 • డైలీ డోస్ ఆఫ్ సన్‌షైన్ (కొరియన్ సిరీస్) - నవంబరు 03
 • ఫెర్రీ: ద సిరీస్ (డచ్ సిరీస్) - నవంబరు 03
 • న్యాద్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 03
 • సెల్లింగ్ సన్‌సెట్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 03
 • స్లై (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 03 
 • ద టైలర్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - నవంబరు 03
 • మ్యాడ్ (తెలుగు సినిమా) - నవంబరు 03

అమెజాన్ ప్రైమ్

 • నకుల్ గర్ల్ (జపనీస్ సినిమా) - నవంబరు 02
 • తాకేషి క్యాసిల్ జపాన్ (జపనీస్ సిరీస్) - నవంబరు 02
 • టేక్ హిజ్ క్యాజిల్ (హిందీ సిరీస్) - నవంబరు 02
 • ఇన్విన్సబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 03
 • PI మీనా (హిందీ సిరీస్) - నవంబరు 03

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో సందీప్ ఎలిమినేషన్.. ఆ ఒక్కటే మైనస్ అయిందా?)

హాట్‌స్టార్

 • బిహైండ్ ద ఎట్రాక్షన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 01
 • ద త్రీ డిటెక్టివ్స్ (జర్మన్ సిరీస్) - నవంబరు 01
 • స్కంద (తెలుగు సినిమా) - నవంబరు 02
 • ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 03

ఆహా

 • ఆర్ యూ ఓకే బేబీ? (తమిళ సినిమా) - అక్టోబరు 31

సోనీ లివ్

 • స్కామ్ 2003: ద తెల్గీ స్టోరీ Vol 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 03

బుక్ మై షో

 • హాఫ్ వే హోమ్ (హంగేరియన్ మూవీ) - నవంబరు 03
 • మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 03
 • ద థీప్ కలెక్టర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 03

ఆపిల్ ప్లస్ టీవీ

 • ఫింగర్ నెయిల్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 03

జియో సినిమా

 • టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ సిరీస్) - నవంబరు 03

(ఇదీ చదవండి: Bigg Boss 7: సందీప్ ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement