భయపెట్టిస్తోన్న ‘పిజ్జా 3 ది మమ్మి’ గ్లింప్స్‌ | Pizza 2 Movie Sequel Pizza 3 The Mummy First Glimpse Release | Sakshi
Sakshi News home page

భయపెట్టిస్తోన్న ‘పిజ్జా 3 ది మమ్మి’ గ్లింప్స్‌

Sep 7 2021 9:10 PM | Updated on Sep 7 2021 9:10 PM

Pizza 2 Movie Sequel Pizza 3 The Mummy First Glimpse Release - Sakshi

అశ్విన్ కాకుమాను క‌థానాయకుడిగా డెబ్యూ డైరెక్ట‌ర్ మోహ‌న్ గోవింద్ రూపొందిస్తోన్న హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘పిజ్జా 3 ది మ‌మ్మీ’. సీవీ కుమార్ నిర్మాణంలో రూపొందిన పిజ్జా 2 కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతుంది.    విమ‌ర్శకుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కించుకోవ‌డంతో పాటు సెన్సేష‌న‌ల్ హిట్‌గా ఈ మూవీ నిలిచింది. అంతేగాక విజ‌య్ సేతుప‌తి కెరీర్ ప్రారంభంలో ఆయ‌న‌కు న‌టుడిగా బ్రేక్ తెచ్చిన చిత్రాల్లో ఇది ఒకటి. ఇప్పుడు మ‌రోసారి నిర్మాత సీవీ కుమార్ అలాంటి హార‌ర్ థ్రిల్ల‌ర్‌తో ‘పిజ్జా 3 ది మమ్మీ’చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇందులో డైరీ ఫేమ్ ప‌విత్రా మారిముత్తు హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను చిత్ర యూనిట్  గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌డం ద్వారా స్టార్ట్ చేసింది. గ్లింప్స్‌లో ప్ర‌తి సీన్ భయం పుట్టిస్తోంది. ఈ గ్లింప్స్ చూసిన త‌ర్వాత ఈ సీట్ ఎడ్జ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. గౌర‌వ్ నారాయ‌ణ‌న్‌, అభిషేక్ శంక‌ర్‌, కాళి వెంక‌ట్‌, అనుప‌మ కుమార్‌, ర‌వీనా దాహ‌, కురైసి, యోగి, సుభిక్ష ఇత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పిజ్జా2కు సీక్వెల్‌గా పిజ్జా3ని ఒరిజిన‌ల్ స్క్రిప్ట్‌తో రూపొందించారు. అశ్విన్ హేమంత్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌భు రాఘ‌వ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement