ఓటీటీలో దూసుకెళ్తున్న ‘పిండం’ | Sakshi
Sakshi News home page

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘పిండం’

Published Sun, Feb 18 2024 2:21 PM

Pindam Movie Streaming On Amazon Prime Video - Sakshi

ప్రముఖ నటుడు శ్రీరామ్ అలాగే శ్రీనివాస్ అవసరాల, సీనియర్ నటి ఈశ్వరి రావు ముఖ్య పాత్రల్లో దర్శకుడు సాయి కిరణ్ దైదా తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ చిత్రం “పిండం”. ఇటీవల మంచి ప్రమోషన్స్ నడుమ అలాగే మోస్ట్ స్కేరియెస్ట్ సినిమాగా థియేటర్స్ లో విడుదలై థియేటర్ ఆడియాన్స్ తో ప్రశంశలు పొందింది. తాజాగా ఈ చిత్రం అయితే ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

పిండం సినిమా ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో  అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతొంది. అలాగే తెలుగు, తమిళ్ భాషల్లో ఆహలో  అందుబాటులో ఉంది.  ఇక ఈ చిత్రానికి కృష్ణ శౌరబ్ సూరంపల్లి సంగీతం అందించగా యశ్వంత్ దగ్గుమాటి నిర్మాణం వహించారు. థియేటర్స్ లో మిస్ ఆయన ప్రేక్షకులు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తో కలిసి చూడొచ్చు. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు అన్ని ఏజ్ గ్రూప్స్ కిలిసి చూసే విధంగా సినిమాను తెరకెకించారు సాయి కిరణ్ దైదా. 

‘పిండం’ కథేంటంటే..
క్రైస్తవ మతానికి చెందిన ఆంథోని(శ్రీరామ్‌) రైస్‌ మిల్లులో ఓ అకౌంటెంట్‌. భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి  సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివాసం ఉంటాడు. అది పురాతమైన ఇల్లు. తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు ఆంథోని. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆంథోని ప్యామిలీకి ఉహించని సంఘటనలు ఎదురవుతాయి. గర్భవతిగా ఉన్న భార్య మేరి ఆస్పత్రి పాలవుతుంది. మూగదైన చిన్నకూతురు తారను ఓ ఆత్మ ఆవహిస్తుంది. ఆ ఫ్యామిలీని చంపేందుకు క్షుద్రశక్తులు ప్రయత్నిస్తాయి.

అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి అన్నమ్మ(ఈశ్వరీరావు) రంగంలోకి దిగుతుంది. ఆంథోని ఫ్యామిలీని వేధిస్తుంది ఒక ఆత్మ కాదని..ఆ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని అన్నమ్మ గుర్తిస్తుంది. అసలు ఆ  ఆత్మల కథేంటి? వాళ్లు ఎలా చనిపోయారు? ఆంథోని ఆ పురాతన ఇంటిని ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఆ ఇంట్లో అంతకు ముందు ఏం జరిగింది? ఆ ఇంటి నుంచి ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ ఏం చేసింది? చిన్న కూతురు తారను ఆవహించిన ఆత్మను విదిలించేక్రమంలో అన్నమ్మకు ఎదురదైన సమస్యలు ఏంటి? చివరకు ఆంథోని ఫ్యామిలీని అన్నమ్మ ఎలా రక్షించింది? 1932లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకునేందుకు లోక్‌నాథ్‌(అవసరాల శ్రీనివాస్‌)ఎందుకు ఆసక్తి చూపాడు? అనేది తెలియాలంటే ‘పిండం’సినిమా చూడాల్సిందే.

Advertisement
 
Advertisement