
పాయల్ కపాడియా తెరకెక్కించిన చిత్రం ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్. గతంలో ఈ మూవీ పలు ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌లు గెలుచుకుంది. అంతర్జాతీయ వేదికలపై సైతం సత్తా చాటింది. తాజాగా ఈ సినిమా మరో ఘనతను సాధించింది. ప్రముఖ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ చిత్రంగా నిలవగా.. ఉత్తమ డైరెక్టర్‌గా పాయల్ కపాడియా నిలిచింది. మరోవైపు బాలీవుడ్ నటుడు దిల్జిత్ దోసాంజ్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అమర్ సింగ్ చమ్కిలా చిత్రంలో తన నటనకు గానూ అవార్డ్ గెలుచుకున్నారు.
ఫిల్మ్ క్రిటిక్స్ గిల్డ్, గ్రూప్ఎమ్ మోషన్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2025 విజేతలను తాజాగా ప్రకటించారు. ఈ వేడుకలో ఇండియాకు చెందిన పలు ఫీచర్ ఫిల్మ్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీ, వెబ్ సిరీస్‌లలో అత్యుత్తమ అవార్డులు సాధించాయి. ఈ
ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో దిల్జిత్ దోసాంజ్ అమర్ సింగ్ చమ్కిలా సైతం పెద్ద విజయాన్ని అందుకుంది.
దిల్జిత్ దోసాంజ్ ఉత్తమ నటుడిగా ఎంపికవ్వగా.. ఉత్తమ నటిగా ప్యారడైజ్ మూవీ హీరోయిన్ దర్శనా రాజేంద్రన్ అవార్డును గెలుచుకుంది. అలాగే లపాతా లేడీస్‌లో రవి కిషన్ పాత్రకు గాను ఉత్తమ సహాయ నటుడి అవార్డు దక్కించుకున్నారు. అలాగే గర్ల్స్ విల్ బి గర్ల్స్‌లో తన అద్భుతమైన నటనకు కని కస్రుతి ఉత్తమ సహాయ నటిగా ఎంపికైంది. వెబ్ సిరీస్ కేటగిరీలో పోచర్ ఆధిపత్యం కనబరిచింది. ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది.
షార్ట్ ఫిల్మ్ కేటగిరీ విజేతలు
ఉత్తమ షార్ట్ ఫిల్మ్: ఓబుర్
ఉత్తమ దర్శకుడు: ఫరాజ్ అలీ (ఓబుర్).
ఉత్తమ నటుడు: జల్ తు జలాల్ తూ చిత్రానికి హరీష్ ఖన్నా
ఉత్తమ నటి: తాక్ (ట్రాకర్) కోసం జ్యోతి డోగ్రా
ఉత్తమ రచన: ఓబుర్‌కి ఫరాజ్ అలీ
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆనంద్ బన్సాల్ (ఓబుర్)
డాక్యుమెంటరీ విభాగం
ఉత్తమ డాక్యుమెంటరీ: నాక్టర్న్స్
వెబ్ సిరీస్ విభాగం..
ఉత్తమ వెబ్ సిరీస్: పోచర్
ఉత్తమ దర్శకుడు: రిచీ మెహతా(పోచర్)
ఉత్తమ నటుడు: బరున్ సోబ్తి (రాత్ జవాన్ హై)
ఉత్తమ నటి: నిమిషా సజయన్(పోచర్)
ఉత్తమ సహాయ నటుడు: దిబ్యేందు భట్టాచార్య(పోచర్)
ఉత్తమ సహాయ నటి: కని కస్రుతి(పోచర్)
ఉత్తమ రచన: రిచీ మెహతా, గోపన్ చిదంబరన్, సుప్రోతిం సేన్‌గుప్తా, అమృత బాగ్చి (పోచర్)
ఫీచర్ ఫిల్మ్ విభాగం..
ఉత్తమ చిత్రం: ఆల్ వు ఇమేజిన్ యాజ్ లైట్
ఉత్తమ దర్శకురాలు: పాయల్ కపాడియా (ఆల్ వు ఇమేజిన్ అజ్ లైట్).
ఉత్తమ నటుడు: దిల్జిత్ దోసాంజ్ (అమర్ సింగ్ చమ్కిలా)
ఉత్తమ నటి: దర్శనా రాజేంద్రన్(ప్యారడైజ్)
ఉత్తమ సహాయ నటుడు: రవి కిషన్ (లపాతా లేడీస్ )
ఉత్తమ సహాయ నటి: కనీ కస్రుతి (ఫర్ గర్ల్స్ విల్ బి గర్ల్స్)
ఉత్తమ రచన: ఆనంద్ ఎకర్షి (ఆట్టం)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రణబీర్ దాస్ (ఆల్ వి ఇమేజిన్ అస్ లైట్)
ఉత్తమ ఎడిటింగ్: శివకుమార్ వి. పనికర్ (కిల్)
జెండర్ సెన్సిటివిటీ అవార్డు: గర్ల్స్ విల్ బి గర్ల్స్