పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల | Amazon Prime Panchayat Season 3 Web Series Trailer Out Now, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Panchayat 3 Trailer: పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల

Published Wed, May 15 2024 5:01 PM

Panchayat 3 Trailer Out Now

అమెజాన్‌ ప్రైమ్‌లా బెస్ట్‌ వెబ్‌ సిరీస్‌లో లిస్ట్‌లో  'పంచాయ‌త్' తప్పకుండా ఉంటుంది. ఇప్పటి వరకు విడుదలై రెండు సిజన్లూ సూపర్‌ హిట్‌ అందుకున్నాయి. సీజన్‌ 3 కోసం ఎదురుచూస్తోన్న‌ ఫ్యాన్స్‌ కోసం మేకర్స్‌ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. మే 28 నుంచి ఈ సిరీస్‌ అమెజాన్‌లో విడుదల కానుంది. 2020లో మొదటి సీజన్‌ విడుదలైతే.. 2022లో సీజన్‌-2 రిలీజ్‌ అయింది.

కామెడీ డ్రామా సిరీస్‌లో అభిషేక్‌ త్రిపాఠిగా నటించిన జితేంద్రకుమార్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. ఇండియాలోనే అత్య‌ధిక మంది వీక్షించిన వెబ్‌సిరీస్‌ల‌ లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో ఒక‌టిగా పంచాయ‌త్ సీజ‌న్ 1, సీజ‌న్ 2 నిలిచాయి. గ‌త సీజ‌న్స్ లాగే సీజ‌న్ 3 కూడా ఎనిమిది ఎపిసోడ్స్‌తో విడుదల కానుంది. మే 28 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో 'పంచాయ‌త్' సీజన్‌ 3 ఎంట్రీ ఇవ్వనుంది.

తాజాగా విడుదలైన ట్రైలర్‌తోనే పంచాయత్‌ మూడో సీజన్‌పై భారీ అంచనాలను పెంచేశారు. తొలి రెండు సీజన్‌లు ఎంతటి హిట్‌ అందుకున్నాయో.. మూడో సీజన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని అంచనావేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కామెడీకి ఎక్కువ చోటు కల్పించిన దర్శకుడు రెండో భాగం ముగింపులో  కాస్త భావోద్వేగాలను కూడా జోడించడంతో మరింతగా ప్రేక్షకులకు ఈ సిరీస్‌ దగ్గరైంది.

 

Advertisement
 
Advertisement
 
Advertisement