ఓం భీమ్‌ బుష్‌! | Sakshi
Sakshi News home page

ఓం భీమ్‌ బుష్‌!

Published Fri, Feb 23 2024 2:11 AM

Om Bheem Bush Movie First Look Release  - Sakshi

‘సామజవరగమన’(2023) వంటి హిట్‌ మూవీ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. ‘నో లాజిక్‌ ఓన్లీ మ్యాజిక్‌’ అన్నది ఉపశీర్షిక. ‘హుషారు’ ఫేమ్‌ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్‌ కథానాయికలుగా నటించారు. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రలు చేశారు. యువీ క్రియేషన్స్‌  సమర్పణలో వి సెల్యులాయిడ్స్‌పై సునీల్‌ బలుసు నిర్మించారు.

ఈ సినిమాకి ‘ఓం భీమ్‌ బుష్‌’  అనే టైటిల్‌ ఖరారు చేసి, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు మేకర్స్‌. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ వ్యోమగామి దుస్తులు ధరించి, తమ చేతుల్లో కరపత్రాలతో నడుచుకుంటూ వస్తున్న ఫస్ట్‌ లుక్‌ ఆసక్తిగా ఉంది. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూ΄÷ందిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. మార్చి 22న సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌ తోట, సంగీతం: సన్నీ ఎం.ఆర్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement