రొమాంటిక్ లవ్ స్టోరీగా 'జస్ట్ ఏ మినిట్'.. లిరికల్ సాంగ్ రిలీజ్! | Nuvvante Istam Video Song Released from Just A Minute Movie | Sakshi
Sakshi News home page

Just A Minute Movie: రొమాంటిక్ లవ్ స్టోరీగా 'జస్ట్ ఏ మినిట్'.. లిరికల్ సాంగ్ రిలీజ్!

Feb 13 2024 9:00 PM | Updated on Feb 13 2024 9:01 PM

Nuvvante Istam Video Song Released from Just A Minute Movie - Sakshi

అభిషేక్ పచ్చిపాల, నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం "జస్ట్ ఎ మినిట్". ఈ సినిమాను  రెడ్ స్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్‌,  కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై అర్షద్ తన్వీర్, ప్రకాష్ ధర్మపురి నిర్మించారు. పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. నువ్వంటే ఇష్టం అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా దర్శకుడు పూర్ణాస్ యశ్వంత్ మాట్లాడుతూ.. 'గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్‌, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ.. డిఫరెంట్‌గా ఉంది కాన్సెప్ట్ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోంది. అతి త్వరలో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయబోతున్నాం.'మని తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఫస్ట్ లుక్, టీజర్‌కి వస్తున్న ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ఇలాగే ప్రేక్షకుల ఆదరణ మా "జస్ట్ ఏ మినిట్ " సినిమా పైన, మా పైన ఉండాలని.. సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం' అని అన్నారు. ఈ చిత్రంలో ఇషిత, వినీషా, కుషి భట్, నాగిరెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement