NTR30: ఫార్మల్ డ్రస్, స్మార్ట్‌ లుక్‌.. ఎన్టీఆర్‌ ఫోటో వైరల్‌ | NTR30 Team Sends Birthday Wishes To Jr NTR With New Poster | Sakshi
Sakshi News home page

NTR30: ఫార్మల్ డ్రస్, స్మార్ట్‌ లుక్‌.. ఎన్టీఆర్‌ ఫోటో వైరల్‌

May 20 2021 10:22 AM | Updated on May 20 2021 4:08 PM

NTR30 Team Sends Birthday Wishes To Jr NTR With New Poster - Sakshi

Happy Birthday Jr NTR: యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌కు ఇది 30వ చిత్రం. ఇటీవల ఈ ప్రాజెక్టను అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు.  నేడు (మే 20) ఎన్టీఆర్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా  NTR30 టీమ్‌ అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ని అందించింది. ఎన్టీఆర్‌ కొత్త లుక్‌ని విడుదల చేస్తూ బర్త్‌డే విషెష్‌ అందజేసింది. ఇందులో ఎన్టీఆర్‌ ఫార్మల్ డ్రస్ లో స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతంఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు.  ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమురంభీమ్‌గా, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. . ఈ సినిమా పూర్తైన వెంటనే తారక్‌.. కొరటాల శివ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement