మర్చిపోలేనంత ప్రేమ | NTR supports Akhil Lenin with special voice-over | Sakshi
Sakshi News home page

మర్చిపోలేనంత ప్రేమ

Jul 7 2026 2:23 AM | Updated on Jul 7 2026 2:23 AM

NTR supports Akhil Lenin with special voice-over

అఖిల్, ఎన్టీఆర్‌

‘లెనిన్ ’కు సపోర్ట్‌గా నిలిచారు హీరో ఎన్టీఆర్‌. అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన సినిమా ‘లెనిన్ ’. మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న  రిలీజ్‌ కానుంది. తాజాగా ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. 

‘‘లెనిన్ ’ సినిమా కథ, నేపథ్యం, శ్రీరామపురం గురించి ఎన్టీఆర్‌ తన గంభీరమైన గాత్రంతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ చిత్రానికి ఆయన వాయిస్‌ ఓవర్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ‘‘లెనిన్ ’ సినిమా కోసం గర్జించినందుకు థ్యాంక్యూ.. టైగర్‌. ఎప్పటికీ మర్చిపోలేనంత ప్రేమ ఇచ్చావు. లవ్‌యూ.. బ్రదర్‌ (ఎన్టీఆర్‌ను ఉద్దేశించి..)’’ అని ఈ సందర్భంగా ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు అఖిల్‌ అక్కినేని.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement