ఆస్కార్‌ నామినేషన్‌ రేసులో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు నో ఎంట్రీ.. ఎంపికైన చిత్రం ఇదే..

Not RRR or Kashmir Files, Gujarati Film Chhello Show India Oscars Entry - Sakshi

తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు బిగ్‌ షాక్‌ తగిలింది. అనేక రికార్డులు బద్దలు కొట్టి, బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు 2023 ఆస్కార్‌ నామినేషన్‌ రేసులో ఎంట్రీ లభించలేదు. కశ్మీర్‌ ఫైల్స్‌కు సైతం ఆస్కార్‌ రేసులో చోటు దక్కలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌, కశ్మీర్‌ ఫైల్స్‌ను దాటుకొని ఓ చిన్న సినిమా ఆస్కార్‌ బరిలో నిలిచింది. 

రేసులోకి గుజరాతీ సినిమా
గుజరాతీ సినిమా ‘ఛెల్లో షా’ మూవీ ఆస్కార్‌ నామినేషన్‌ రేసులోకి అధికారిక ఎంట్రీ ఇచ్చింది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఈ మూవీ చోటుదక్కించుకుంది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పాన్‌  నలిన్‌  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భవిన్‌  రాబరి, భవేష్‌ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్‌  రావల్‌ ప్రధాన పాత్రధారులు.  దర్శకుడు నలిన్‌  నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

కాగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించారు. ఈ ఏడాది మార్చి 25న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. దాదాపు రూ. 1000కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉందని జోరుగా ప్రచారం సాగింది. దీంతో ఈ సినిమా ఆస్కార్​ రేసులో నిలుస్తుందని అంతా భావించారు. కానీ ఆస్కార్​ బరిలో ఆర్​ఆర్​ఆర్​ ఎంపిక కాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
చదవండి: కార్తికేయ 2, బింబిసార ఓటీటీ రిలీజ్‌.. క్లారిటీ ఇచ్చిన జీ5..!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top