OTT Releases: కార్తికేయ 2, బింబిసార ఓటీటీ రిలీజ్‌.. క్లారిటీ ఇచ్చిన జీ5..!

ZEE 5 Clarity On Karthikeya 2 And Bimbisara OTT Release Dates - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2. ​‍ఆగష్టులో విడుదలైన ఈ చిత్రం ఊహించని విజయం సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని అప్‍డేట్ల కోసం వెతుకున్నారు. అయితే ‘కార్తికేయ2’ను సైతం దసరా కానుకగా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అక్టోబరు మొదటివారం స్ట్రీమింగ్‌కు రావచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిన్న చిత్రంగా విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించింది. రూ.100 కోట్ల క్లబ్‌ను దాటేసింది.
(చదవండి: మల్టీప్లెక్స్‌ల‍్లో 75 రూపాయలకే సినిమా హ్యపీగా చూసేయండి..)

ఇక ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయం సాధించిన మరో చిత్రం 'బింబిసార'. ఈ చిత్రం కల్యాణ్‌రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కోసం ఓటీటీలో ఎప్పుడోస్తుందా అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాల విడుదలపై జీ5 స్పందించింది. ‘మీ ఉత్సాహానికి సంతోషంగా ఉంది. దయచేసి వేచి ఉండండి. మరిన్ని వివరాలకు మా సోషల్‌మీడియా ఖాతాలను అనుసరించండి’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నడుస్తున్న ప్రచారం చూస్తే కల్యాణ్‌రామ్‌ ‘బింబిసార’ సెప్టెంబర్ 23న విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top