Sonu Sood: సోనూసూద్‌.. తప్పుడు సందేశాలివ్వొద్దు!: నార్త్‌ రైల్వే ఆగ్రహం

Northern Railway Slams Actor Sonu Sood for Travelling on Footboard - Sakshi

రీయల్‌ హీరో, బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌పై ఉత్తర రైల్వే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుట్‌బోర్డుపై ట్రావేల్‌ చేయడం ప్రమాదకరమైన మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దంటూ ఆయనను హెచ్చరించింది. అసలు ఏమైందంటే.. ఇటీవల సోనూసూద్‌ రైలులో ప్రయాణిస్తున్న వీడియో షేర్‌ చేశాడు. ఇందులో ఆయన కదులుతున్న రైలులో ఫుట్‌బోర్డు వద్ద కూర్చుని బయటకు చూస్తూ కనిపించాడు. ఈ వీడియో చూసిన నార్త్‌ రైల్వే అధికారులు ఈ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

చదవండి: ఇండియన్‌ నెంబర్‌ వన్‌ మూవీగా జాన్వీ కపూర్‌ చిత్రం!

‘డియర్‌ సోనూసూద్‌.. మీరు దేశంలోనే కాదు ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజలకు రోల్ మోడల్. రైలు ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం ప్రమాదకరం. ఈ రకమైన వీడియో మీ అభిమానులకు తప్పుడు సందేశాన్ని పంపవచ్చు. దయచేసి ఇలా చేయకండి! సాఫీగా, సురక్షితమైన ప్రయాణం ఆనందించండి’ అని ఉత్తర రైల్వే ట్వీట్ చేసింది. అలాగే ముంబై రైల్వే కమిషనర్‌ కూడా ఇది ప్రమాదకరమని పేర్కొంది. నిజ జీవితంలో ఇలాంటి స్టంట్‌ చేయొద్దని కోరింది. ‘’మీరు(సోనుసూద్‌) ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం మీ సినిమాలోని ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఓ భాగం కావచ్చు.

చదవండి: అవికా గోర్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన నాగ్‌

కానీ నిజ జీవితంలో కాదు. అన్ని భద్రత మార్గదర్శకాలను పాటించి అందరికి ‘హ్యాపీ న్యూ ఇయర్‌ని అందిద్దాం’’ అని జీఆర్‌పీ ముంబై తమ ట్వీట్‌లో రాసుకొచ్చింది. కాగా సోనుసూద్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లాక్‌డౌన్‌లో ఎంతోమంది నిరాశ్రయులకు, ముంబైలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కూలీలకు ఆయన చేయూతను అందించారు. కూలీల కోసం స్పెషల్‌గా బస్సులు కేటాయించి వారి వారి సొంత రాష్ట్రాలకు చేర్చారు. అంతేకాదు ఇతర దేశాల్లో చిక్కుకున్న వారిని సైతం స్పెషల్‌ ఫ్లైట్స్‌లో భారత్‌కు తీసుకువచ్చారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు సోనుసూద్‌ నిరాంతరాయంగా సామాజిక సేవలు అందిస్తూనే ఉన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top