చెక్‌ ఫస్ట్‌ గ్లింప్స్‌: దేశ ద్రోహిగా మారిన నితిన్‌ | Nithin Check Movie First Glimpse Released | Sakshi
Sakshi News home page

నితిన్‌ ‘చెక్‌’ ఫస్ట్‌ గింప్స్‌ వచ్చేసింది

Jan 3 2021 11:09 AM | Updated on Jan 3 2021 2:26 PM

Nithin Check Movie First Glimpse Released - Sakshi

గతేడాది ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్‌ హీరో నితిన్‌... కొత్త ఏడాదిలోనూ వరుస సినిమాలను ప్లాన్‌ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం నితిన్‌ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ‘రంగ్‌ దే’ మార్చి 26న విడుదల కానున్న విషయం తెలిసిందే.   ఈ సినిమాతో పాటు అంధాధున్‌ తెలుగు రీమేక్‌, చంద్రశేఖర్‌ యేలేటి డైరెక్షన్‌లో ‘చెక్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ జంటగా రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు.

తాజాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ‘చెక్‌’ ఫస్ట్‌ గింప్స్‌ని ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో నితిన్‌ ఆదిత్య అనే ఖైది పాత్రలో నటిస్తున్నాడు. ‘జైలులో ఆదిత్య అనే ఖైది చెస్‌ అద్భుతంగా ఆడుతున్నాడు’ అని ఒక వ్యక్తి చెబుతుంతే.. ‘అద్భుతంగా అంటే? అని మరో వ్యక్తి ప్రశ్నించగా, విశ్వనాథ్‌ ఆనంద్‌, కస్పరోవ్‌ లాగా అని మరో వ్యక్తి సమాధానం ఇచ్చాడు. ఇక పోలీస్‌ ఆఫీసర్‌ అయిన సంపత్‌ రాజ్‌.. తీవ్రవాది, టెర్రరిస్ట్‌, దేశద్రోహి ఇది నీ గుర్తింపు అంటూ నితిన్‌ని హేళన చేస్తున్నాడు.  తాజాగా విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌ చూస్తుంటే.. ఒక తెలివైన వ్యక్తి అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని శిక్ష అనుభవిస్తాడని, దాని నుంచి ఎలా బయటపడ్డారనేది కథలో చూపించనున్నారు.  జీవితాన్ని ముడిపెడుతూ, చెస్ లో నైపుణ్యం వున్న ఓ యువకుడి జీవితాన్ని నెరేట్ చేస్తూ అందిస్తున్న సినిమా ఇది. మనమంతా లాంటి ఫీల్ గుడ్, ఎమోషనల్ మూవీ తరువాత చంద్రశేఖర్ యేలేటి  చేస్తున్న సినిమా 'చెక్' సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పింస్తుందో చూడాలి మరి. 

Advertisement
 
Advertisement
Advertisement