రాబిన్‌హుడ్‌ డేట్‌ ఫిక్స్‌ | Nithiin Robinhood Release Date fix | Sakshi
Sakshi News home page

రాబిన్‌హుడ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Thu, Apr 18 2024 1:28 AM | Last Updated on Thu, Apr 18 2024 1:28 AM

Nithiin Robinhood Release Date fix - Sakshi

నితిన్‌ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‌’ విడుదల తేదీ ఖరారు అయింది. డిసెంబర్‌ 20న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్‌ కీలక పాత్రలు ΄ోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘‘అన్ని వాణిజ్య అంశాలతో పాటు వినోదంతో రూపొందుతోన్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. ఈ చిత్రంలో నితిన్‌ మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కనిపిస్తారు. తన గెటప్‌ నుండి క్యారెక్టరైజేషన్‌ వరకు పూర్తిగా డిఫరెంట్‌గా ప్రెజెంట్‌ చేస్తున్నారు వెంకీ కుడుముల. క్రిస్మస్‌ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్‌ సెలవులు మా సినిమాకి కలిసి రానున్నాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: సాయి శ్రీరామ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement