నిఖిల్‌ 'కార్తికేయ 2'గా వచ్చేది అప్పుడే.. | Nikhil Karthikeya 2 Movie Release Date Announced | Sakshi
Sakshi News home page

Karthikeya 2 Movie: నిఖిల్‌ 'కార్తికేయ 2'గా వచ్చేది అప్పుడే..

Published Mon, Apr 11 2022 6:47 PM | Last Updated on Mon, Apr 11 2022 6:53 PM

Nikhil Karthikeya 2 Movie Release Date Announced - Sakshi

Nikhil Karthikeya 2 Movie Release Date Announced: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో నిఖిల్. హ్యాపీ డేస్‌ సినిమాతో వెండితెరకు పరిచయమైన నిఖిల్‌ ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నాడు. 2014లో నిఖిల్‌ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రం మంచి సక్సెస్‌ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ 'కార్తికేయ 2' రానున్న విషయం తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. 

'ది కశ్మీర్‌ ఫైల్స్‌' చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ 'కార్తికేయ 2' మూవీ ప్రొడ్యూసర్‌లలో ఒకరు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం (ఏప్రిల్ 11) ఈ సినిమా విడుదల తేదిని రివీల్‌ చేశారు. 'కార్తికేయ 2' జూలై 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా షేర్ చేశారు. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక, దాపర యుగానికి సంబంధించిన కథతో ఈ సినిమా వస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న  ఈ మూవీలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

చదవండి: 'నాలుగు సినిమాలకు సైన్‌ చేశాను.. ఇప్పుడేమో ఇలా అయ్యింది'చదవండి: అనుపమ అల్లరిని బయటపెట్టిన నిఖిల్‌, షూటింగ్‌ టైంలో అలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement