ప్రేమను పంచుతానంటోన్న నిధి అగర్వాల్​

Nidhhi Agerwal Helps With Distribute Love in Corona  - Sakshi

సినిమా హీరోలు కరోనా కష్టకాలంలో సాయానికి ముందు రావట్లేదనే విమర్శలు ఎక్కువ వినిపిస్తుంటాయి. అయితే కొందరు సినీ సెలబ్రిటీలు మాత్రం తమ శక్తిమేర సాయంతో అండగా నిలుస్తున్నారు. రీసెంట్​గా ఈ లిస్ట్​లో చేరింది అందాల భామ నిధి అగర్వాల్​. ‘డిస్ట్రిబ్యూట్​ లవ్’ పేరుతో ఒక ఆర్గనైజేషన్​ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. 

త్వరలో డిస్ట్రిబ్యూట్​ లవ్​ పేరుతో ఛారిటబుల్ ఆర్గనైజేషన్​ను మొదలుపెడుతున్నా. ఈ కష్టకాలంలో సాయం కావాలనుకున్న వాళ్లు ఎవరైనా సరే ఈ వెబ్​సైట్​కు రిక్వెస్ట్​లు పెట్టొచ్చు. వాళ్లకు అవసరమైన సాయాన్ని నాకు చేతనైనంత మేర అందిస్తా. నిత్యావసరాలు, మందులు.. ఇలా ఏవైనా సరే సాయానికి నేను సిద్ధం అని చెప్పింది నిధి. ఇక కొవిడ్​ కోసమే ప్రత్యేకంగా. ఆమెతో పాటు ఆమె టీం ఈ ఆర్గనైజేషన్​ కోసం పని చేస్తాయని తెలిపింది. 

కాగా, 2017లో మున్నా మైకేల్ బాలీవుడ్ ఫిల్మ్​ ద్వారా ఫేమ్​ అయిన నిధి అగర్వాల్​, తెలుగు, తమిళ సినిమాల్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. కోలీవుడ్​ అభిమానులు ఏకంగా ఆమెకు ఓ గుడి కట్టడం విశేషం. కాగా, ప్రస్తుతం క్రిష్​ డైరెక్షన్​లో పవన్​ కళ్యాణ్​ హీరోగా ‘హరిహరవీరమల్లు’లో నిధి హీరోయిన్​గా నటిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top