హనుమత్‌ సుందరకాండ | New Era for Indian Animation with Hanumat Sundarakanda | Sakshi
Sakshi News home page

హనుమత్‌ సుందరకాండ

Jul 6 2026 4:08 AM | Updated on Jul 6 2026 4:08 AM

New Era for Indian Animation with Hanumat Sundarakanda

ఇండియన్‌ యానిమేషన్‌ సినిమా ‘మహావతార్‌ నరసింహా’ బాక్సాఫీస్‌ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో యానిమేషన్‌ చిత్రాల మేకింగ్‌పై కొందరు దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ‘బాహుబలి: ది ఎటర్నల్‌ వార్‌’, ‘వాయుపుత్ర’ వంటి సినిమాల ప్రకటనలు వచ్చాయి. తాజాగా యానిమేషన్‌ సినిమా ‘హనుమత్‌ సుందరకాండ’ ప్రకటన వచ్చింది.

‘ఫ్రమ్‌ ది ఎటర్నల్‌ రామాయణ’ అనేది క్యాప్షన్‌. ఈ 3డీ యానిమేషన్‌ సినిమాని అరుణ్‌కుమార్‌ రాపోలు దర్శకత్వంలో నిశ్చిత సేతు, హరినాథ్‌ దేవర నిర్మిస్తున్నారు. హాలీవుడ్‌ సినిమాల్లో వినియోగించే మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ, కట్టింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీని ఈ ‘హనుమత్‌ సుందరకాండ’ చిత్రానికి ఉపయోగిస్తున్నట్లుగా యూనిట్‌ పేర్కొంది. యానిమేషన్‌ సినిమాల్లోని  పాత్రల హావభావాలు, కదలికలు స్క్రీన్‌పై రియలిస్టిక్‌గా కనిపించేందుకు ఈ సాంకేతికతను ఫిల్మ్‌ మేకర్స్‌ వినియోగిస్తుంటారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement