Netflix New Movies, Web Series Releases in 2021, Telugu, Hindi, Tamil and Other Languages - Sakshi
Sakshi News home page

ఆ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లన్నీ నెట్‌ఫ్లిక్స్‌లోనే!

Mar 5 2021 7:04 PM | Updated on Mar 5 2021 7:32 PM

Netflix Upcoming Movies, Web Series List - Sakshi

బడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేయడానికి ముందే తమ స్క్రీన్‌ పైకి తెచ్చుకుంటున్నాయి. తాజాగా టాప్‌ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తమ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్‌ కానున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు..

లాక్‌డౌన్‌ టైమ్‌లో థియేటర్స్‌ క్లోజ్‌ చేసి ఉండటంతో నిర్మాతల దృష్టి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌వైపు మళ్లింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్‌ వంటి బడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ హిందీ, తెలుగు అనే తేడా లేకుండా పెద్ద హీరోల సినిమాలను స్ట్రీమింగ్‌ చేస్తున్నాయి. వీటితో పాటు పలు వెబ్‌ సిరీస్‌ కూడా కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లో లాక్‌ అయినవారిని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యాయి. 100 శాతం సీటింగ్‌తో నడుపుకోవచ్చనే అనుమతి కూడా ప్రభుత్వం నుంచి లభించింది. థియేటర్స్‌లో సినిమా వస్తే చూసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రేక్షకులు కలెక్షన్స్‌ రూపంలో చెప్పారు. కానీ బడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేయడానికి ముందే తమ స్క్రీన్‌ పైకి తెచ్చుకుంటున్నాయి. తాజాగా టాప్‌ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తమ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్‌ కానున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, డాక్యుమెంటరీ, రియాలటీ షోల లిస్ట్‌ను ప్రకటించింది. ఆ వివరాలు..

సోనాక్షీ సిన్హా, తాహిర్‌ రాజ్‌ బాసిన్‌  ప్రధాన పాత్రధారులుగా శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘బుల్‌బుల్‌ తరంగ్‌’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. రామ్‌ మాద్వానీ డైరెక్షన్‌లో కార్తీక్‌ ఆర్యన్‌ నటించిన ‘ధమాకా’, తాప్సీ, విక్రాంత్‌ మెస్సీ హీరోహీరోయిన్లుగా నటించిన ‘హసీనా దిల్‌రుబా’, అభిమన్యు, సాన్యా మల్హోత్రా నటించిన ‘మీనాక్షీ సుందరేశ్వర్‌’, తొమ్మిది మంది దర్శకులతో తొమ్మిది భాగాలుగా దర్శకుడు మణిరత్నం నిర్మిస్తున్న ‘నవరస’, ధనుష్‌ ‘జగమే తందిరం’, బాబీ డియోల్‌ అర్జున్‌ రామ్‌పాల్‌ చేసిన ‘పెంట్‌హౌస్‌’, అర్జున్‌ కపూర్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన ‘సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌’, రవీనా టాండన్‌ ‘అరణ్యక్‌’ చిత్రాలతో పాటు ‘జాదూగర్, అజీప్‌ దాస్తాన్, ది డిసిపుల్‌’ చిత్రాలు రాబోయే రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నాయి.

ఈ సినిమాలతో పాటు ‘రే, ఫైండింగ్‌ అనామిక’, ‘ఫీల్స్‌ లైక్‌ ఇష్క్‌’, ‘బాంబే బేగమ్స్‌’, ‘డీకపుల్డ్‌’, ‘కోట ఫ్యాక్టరీ’ వంటి కొత్త వెబ్‌సిరీస్‌లతో పాటు ‘లిటిల్‌ థింగ్స్‌ సీజన్‌ 4’, ‘ఢిల్లీ క్రైమ్‌ 2’, ‘షీ సీజన్‌ 2’ వంటి కొనసాగింపు వెబ్‌ సిరీస్‌లను నెట్‌ఫ్లిక్స్‌ అనౌన్స్‌ చేసింది. అలాగే స్టాండప్‌ కామెడీ, టీవీ రియాలిటీ షో, డాక్యుమెంటరీలను కూడా ప్రకటించింది. మొత్తంగా 41 ప్రాజెక్ట్‌లను అనౌన్స్‌ చేసింది నెట్‌ఫ్లిక్స్‌. ఇందులో 13 సినిమాలు, 15 స్క్రిప్టెడ్‌ సిరీస్‌లు, 6 స్టాండప్‌ కామెడీ స్పెషల్స్, 4 డాక్యుమెంటరీలు, 3 రియాల్టీ టీవీ షోలు ఉన్నాయి.

చదవండి: ఈ చిత్రం నన్ను పూర్తి మనిషిగా మార్చింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement