త్వరలో పెళ్లి వీడియో విడుదల చేస్తా... అప్పటి వరకూ: నేహా

Neha Kakkar And Rohanpreet Singh Surprises Fans With Roka Video - Sakshi

ముంబై: కొద్దిరోజులుగా తన వివాహం​ రేపోమాపో అంటూ వస్తున్న పుకార్లకు బాలీవుడ్‌ గాయని నేహా కక్కర్‌ క్లారిటి ఇచ్చింది. రోహన్‌ ప్రీత్‌ సింగ్‌-నేహా కక్కర్‌లు ఈ నెలలో వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తేదీ మాత్రం ఖరారు చేయకపోవడంతో ఎప్పడేప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన రోకా కార్యక్రమం వీడియోను షేర్‌ చేసి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ వీడియోను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి వివాహంపై వస్తున్న పుకార్లకు త్వరలోనే చెక్‌ పెడుతూ.. త్వరలోనే వివాహ వీడియో విడుదల కానుందంటూ స్ఫష్టం చేసింది. ‘రేపు నేహుడావియా వీడియో విడుదల అవుతుంది. అప్పటీ వరకు నా నేహార్ట్స్‌, నెహుప్రీత్‌ అభిమానులకు చిన్న బహుమతి. నేను రోహాన్‌ ప్రీత్‌ సింగ్‌,  కుటుంబ సభ్యులను ప్రేమిస్తున్నాను. రోకా వేడుకను ఏర్పాటు చేసిన మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ కక్కర్‌, మిస్టర్‌ కక్కర్‌(మా అమ్మ-నాన్న)లకు ధన్యవాదాలు’ అంటూ వివాహ హ్యాష్‌ ట్యాగ్‌ జత చేసింది. (చదవండి: ఈ నెల‌లోనే ప్ర‌ముఖ‌ సింగ‌ర్ పెళ్లి!)

అయితే ఇటీవల నేహా కక్కర్‌ మొదటిసారిగా రోహాన్‌​ప్రీత్‌సింగ్‌ ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్న వీడియోను షేర్ చేస్తూ‌ త్వరలో వివాహాం తేదీ ఖరారు చేయబోతున్నామంటూ అధికారంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వీడియోను ప్రీత్‌ సింగ్‌ ‘తను మొదటిసారిగా మా ఇంటికి వచ్చిన రోజు. ఈ రోజుకు ఉన్న ప్రత్యేకతను నేను మాటల్లో చెప్పలేను. ప్రపంచం నా చేతిని పట్టుకున్నట్లు ఉంది’ అంటూ తన ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. గాయకుడైన రోహన్‌ప్రీత్‌ సింగ్‌ ప్రముఖ రియాలీటి షోలు ముజ్‌సే షాదీ కరోగే, ఇండియా రైజింగ్‌ స్టార్‌లలో పాల్గొన్నారు. అంతేగాక ప్రస్తుతం నేహా సరిగమప లిటిల్‌ చాంప్స్‌. ఇండియన్‌ ఐడల్‌ టీవీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. అయితే నటుడు హిమాన్ష్‌ కోహ్లితో నేహా విడిపోయాక వారిద్దరూ ఒకరిపై ఒకరూ పరోక్షంగా పలుమార్లు విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంఓ ఇండియన్‌ ఐడల్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన ఆదిత్య నారాయణతో ఆ షోకు జడ్జీగా వ్వవహరిస్తున్న నేహా కక్కర్‌ వివాహానికి ఇరుకుంటుబాలు అంగీకరించిన షో లైవ్‌ లో చూపించిన విషయం తెలిసిందే. అయితే షో స్క్రీప్ట్‌లో భాగమేననంటూ ఆ తర్వాత నేహా, ఆదిత్యలు స్పష్టం చేశారు. (చదవండి: తనతో నా పెళ్లి ఫేక్‌.. టీఆర్‌పీ కోసమే: సింగర్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top