Surekha Sikri :సురేఖ సిఖ్రి మృతిపై నీనా గుప్తా స్పందన

Neena Gupta Reacts To Balika Vadhu Fame Surekha Sikris Demise - Sakshi

చిన్నారి పెళ్లికూతుర(బాలికా వధు)ఫేమ్‌ సురేఖ సిఖ్రి మృతిపై సీనియర్‌ నటి నీనా గుప్తా స్పందించారు. సిఖ్రి ఇక లేరన్న విషయం తెలిసి గుండె బద్దలైపోయింది. ఇది నమ్మలేకపోతున్నాను. ఆమెతో బధాయి హో అనే సినిమాలో కలిసి నటించాను. షూటింగ్‌ బ్రేక్‌లో చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. స్పాట్‌లో రెగ్యులర్‌గా కలిసే తినేవాళ్లం. ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. సిఖ్రి మరణవార్త జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది అంటూ నీనా గుప్తా ఎమోషనల్‌ అయ్యారు.

2018లో వచ్చిన బధాయి చిత్రం ఘన విజయం సాధించింది. ఈ మూవీలో సురేఖ సిఖ్రి నీనా గుప్తాకు అత్తగా నటించారు. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు) ఫేమ్‌ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి (75) గుండెపోటుతో శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి ఈ ఉదయం తుదిశ్వాస విడిచింది.  'కిస్సా కుర్సి కా' చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ సిఖ్రి తమాస్ (1988), మమ్మో (1995) బధాయ్ హో (2018) చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్‌ అవార్డులు సంపాదించుకుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top