ఆర్యన్‌ ఖాన్‌తో లీకైన ఫోటో.. క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీబీ | NCB Clarifies That Man in Selfie with Aryan Khan Not Officer | Sakshi
Sakshi News home page

Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌తో లీకైన ఫోటో.. క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీబీ

Oct 4 2021 10:59 AM | Updated on Oct 4 2021 6:03 PM

NCB Clarifies That Man in Selfie with Aryan Khan Not Officer - Sakshi

షారుక్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ ముంబై తీరంలో జరిగిన రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ తీసుకున్నాడని ఎన్‌సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో ఆర్యన్‌తో మరో ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకుంది. 

అయితే ఎన్‌సీబీ ఆఫీస్‌లో విచారణ కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆర్యన్‌తో సెల్ఫీ తీసుకున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అయితే వైరల్‌ పిక్‌లో ఉన్నది ఓ ఎన్‌సీబీ అధికారి అని అందరూ అనుకున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన ఎన్‌సీబీ ఆ సెల్ఫీలో ఉన్నది తమ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఆఫీసర్‌ కాదని స్పష్టం చేసింది. 

అయితే ఈ డ్రగ్స్‌ కేసు విషయంలో ఆర్యన్‌తో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నూపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాను ఎన్‌సీబీ అరెస్టు చేసింది. కాగా వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

చదవండి: షారుక్‌ కొడుకు ఫోన్‌ సీజ్‌.. డ్రగ్స్‌ కేసులో ప్రమేయంపై విచారణ

Advertisement
 
Advertisement
Advertisement