నయనతార.. ఒరిజినల్‌ పాన్ ఇండియా స్టార్‌ | Nayanthara: A true pan India heroine | Sakshi
Sakshi News home page

నయనతార.. ఒరిజినల్‌ పాన్ ఇండియా స్టార్‌

Mar 31 2026 11:09 PM | Updated on Mar 31 2026 11:20 PM

Nayanthara: A true pan India heroine

పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్‌కి నిజమైన అర్హత సాధించిన నటి నయనతార. ఒక్కో భాషలో ఒక్కో సినిమా చేస్తూ, ఐదు భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నయనతార తెలుగులో ఒక సినిమా షూటింగ్‌ దశలో ఉంది. మలయాళంలో రెండు సినిమాలు సెట్స్‌పై కొనసాగుతున్నాయి. తమిళంలో రెండు సినిమాలు రెడీ అయ్యాయి. మరో సినిమా షూటింగ్‌లో ఉంది. కన్నడలో ఆమె నటించిన టాక్సిక్ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక హిందీ బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు సైన్ చేసింది.  

ఇంతకుముందు షారూక్ ఖాన్‌తో కలిసి జవాన్ చిత్రంలో నయనతార నటించింది. ఇప్పుడు సల్మాన్‌తో కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్ర పోషించనుంది. ఇందులో కూడా ఆమె పాత్రకు యాక్షన్ టచ్ ఉండనుందని సమాచారం.  

ఇలా ఒకేసారి ఐదు భాషల్లో సినిమాలు చేస్తూ నిజమైన పాన్ ఇండియా హీరోయిన్‌గా నిలుస్తోంది నయనతార. నయనతార ఈ స్థాయికి రావడానికి గల కారణాల్లో ఆమె సినిమాల ఎంపికలో చూపే వైవిధ్యం ఒకటి. తన నటనతో ఇప్పటికే దక్షిణాది భాషల్లో బలమైన స్థానం సంపాదించుకున్న ఈ నటి ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకునే ప్రయత్నంలో ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement