నీడలో నయనతార

Nayanthara to star opposite Kunchacko Boban in Nizhal - Sakshi

నయనతార లేడీ సూపర్‌ స్టార్‌. వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో ఎప్పుడూ వెలుగులోనే ఉంటారు. కానీ నయనతార నీడలో ఉండిపోబోతున్నారట. అయితే ఇదంతా సినిమా కోసమే. నయనతార తాజాగా మలయాళంలో ఓ సినిమా కమిటయ్యారు. ‘నిళల్‌’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ  మలయాళ థ్రిల్లర్‌లో హీరోయిన్‌గా నటించనున్నారామె. కున్చాచ్కో బోబన్‌ హీరోగా కనిపిస్తారు. అప్పు యన్‌. బట్టాత్తిరి దర్శకత్వం వహిస్తారు.

నేటి నుంచి ఈ సినిమా చిత్రీకరణ కేరళలో ప్రారంభం కానుందని తెలిసింది. ప్రస్తుతం నయనతార చేతిలో ఉన్న సినిమాల చిత్రీకరణలన్నీ కోవిడ్‌ వల్ల బ్రేక్‌లో ఉన్నాయి. తక్కువ మంది యూనిట్‌ సభ్యులు, తక్కువ రోజుల్లో ‘నిళల్‌’ సినిమా చిత్రీకరణ ను ప్లాన్‌ చేశారు. సినిమా పూర్తయ్యే వరకూ ఏకథాటిగా షూటింగ్‌ జరగనుందని తెలిసింది. నయనతార పోషించే పాత్ర సినిమాకు చాలా కీలకమని, నయనతారే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని చిత్రబృందం తెలిపింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top