మూడోకన్ను

Nayanthara Netrikann First Look Release - Sakshi

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ఇప్పటివరకూ పలు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ థ్రిల్లర్‌తో ముందుకొస్తున్నారు. ‘గృహం’ ఫేమ్‌ మిలింద్‌ రావ్‌ దర్శకత్వంలో ‘నెట్రిక్కన్‌’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు నయనతార. నెట్రిక్కన్‌ అంటే మూడో కన్ను అని అర్థం. ఈ సినిమాలో నయనతార అంధురాలిగా నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని నయనతార బాయ్‌ఫ్రెండ్‌ విఘ్నేష్‌ శివన్‌ నిర్మిస్తున్నారు. ఇది నయనతార కెరీర్‌లో 65వ సినిమా. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ‘ఫస్ట్‌ లుక్‌కి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సినిమాకి సంబంధించి త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌తో వస్తాం’ అన్నారు విఘ్నేష్‌ శివన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top