Dasara Movie Teaser: 'నీయబ్బ ఎట్లయితే గట్లే.. గుండు గుత్తగా లేపేద్దాం..' టీజర్ అదుర్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'దసరా'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
టీజర్ చూస్తే నాని మాస్ యాక్షన్‌ను తలపిస్తోంది . 'ఈర్లపల్లి.. చుట్టూరా బొగ్గు కుప్పులు.. తొంగి చూస్తే గానీ కనిపించని ఊరు. మందు అంటే మాకు వ్యసనం కాదు. అలవాటు పడిన సంప్రదాయం' అనే సంభాషణలతో దసరా టీజర్ మొదలైంది. పోయి బుక్కెడు బువ్వ తిని పండుండ్రా అనే సాయి కుమార్ డైలాగ్ వింటే ఫుల్ ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తలపిస్తోంది. చివర్లో 'నీయబ్బ ఎట్టయితే గట్లా. గుండు గుత్తగా లేపేద్దాం బాంచన్' అనే నాని డైలాగ్ తెలంగాణ యాసను గుర్తు చేసింది. ఊర మాస్ లుక్‌తో ఈ మార్చిలో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు నేచులర్ స్టార్ నాని. తెలుగుతో పాటుగా, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మార్చి 30న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
2023 we have #Dasara ♥️
See you all in the stadiums(Theatres) on March 30th :)#DasaraTeaser https://t.co/nMnAdweUH6@KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @sathyaDP @Navinnooli @SLVCinemasOffl#DasaRampage 🔥 pic.twitter.com/SGcPEvua1K— Nani (@NameisNani) January 30, 2023