‘జెట్టీ’తో నా కల నెరవేరింది | Sakshi
Sakshi News home page

Nandita Swetha: ‘జెట్టీ’తో నా కల నెరవేరింది

Published Wed, Oct 5 2022 9:51 AM

Nandita Swetha Jetty Movie Release In Theaters On September 28th - Sakshi

‘‘గ్రామీణ నేపథ్యంలోని సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించాలనేది నా కల. అది ‘జెట్టీ’తో నెరవేరింది. ఈ చిత్రం మంచి హిట్టవుతుంది’’ అన్నారు హీరోయిన్‌ నందితా శ్వేత. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వంలో నందితా శ్వేత, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జెట్టి’. వేణు మాధవ్‌ కె. నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది.

ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘‘మత్స్యకారుల జీవితాల్లోని సమస్యలను చెప్పే చిత్రమిది. పోర్టుల పేరుతో మత్య్సకారుల జీవితాలను ఎలా ఇబ్బందులు పెడుతున్నారు? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు. ‘జెట్టి అంటే పోర్టు అని అర్థం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజవుతుంది’’ అన్నారు వేణు మాధవ్‌ .కె. మన్యం కృష్ణ, సంగీతదర్శకుడు కె. కార్తీక్‌ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: వీరమణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పండ్రాజు శంకర్రావు.  

Advertisement
 
Advertisement
 
Advertisement