నాన్న కూచి.. మహేశ్‌ ఒడిలో సితార అలా.. ఫోటో వైరల్‌

Namrata Says Mahesh Babu And Sitara Cuddles Early Mornings Are A Must - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో మనందరికీ తెలిసిందే. షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే ప్రిన్స్‌.. వీలుదొరికినప్పుడల్లా ఫ్యామిలీతో టూర్స్‌ వేస్తుంటాడు. ఇక లాక్‌డౌన్‌ సమయంలో అయితే మహేశ్‌ ఎక్కువగా కొడుకు గౌతమ్‌, కూతురు సితారాతోనే గడిపేస్తున్నాడు. వారితో కలిసి సరదాగా ఆడుకున్నాడు. ఆ  ఫొటోలను ఆయన భార్య నమ్రత శిరోద్కర్‌ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా నమ్రత సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫోటో, దానిపై చేసిన కామెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మహేశ్‌ బాబుని తమ గారాలపట్టీ సితార పాప హత్తుకుని పడుకున్న ఫొటో నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 

ఛైర్‌లో కూర్చొని ఉన్న తండ్రిని సితార పాప గట్టిగా హత్తుకొని నిద్రపోయింది. ఆ దృశ్యాన్ని నమత్ర తన కెమెరాలో బంధించి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.‘ఉదయాన్నే గట్టిగా కౌగిలించుకోవడం తప్పనిసరి ! లేదంటే నిద్ర నుంచి తేరుకోవడం చాలా కష్టం.. నిద్రలేపాలంటే ఇదో మంత్రం.. అని నమ్రత తన గారాల పట్టి సితార అలవాటుని బహిర్గతం చేసింది. ప్రస్తుతం ఈ పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇక మహేశ్‌ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top