'నా సామి రంగ' ట్రైలర్ రిలీజ్.. ఆ ఒక్క షాట్ మాత్రం వేరే లెవల్! | Sakshi
Sakshi News home page

Naa Saami Ranga Trailer: రిలీజైపోయిన నాగార్జున 'నా సామి రంగ' ట్రైలర్

Published Tue, Jan 9 2024 4:14 PM

Nagarjuna Naa Saami Ranga Trailer Telugu - Sakshi

ఈసారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలున్నాయి. అందరూ 'గుంటూరు కారం', 'హనుమాన్' గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయితే నాగ్ కూడా సైలెంట్‌గా 'నా సామి రంగ' అంటూ వచ్చేస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌ స్టోరీతో తీసిన ఈ మూవీపై అంచనాలు ఓ మాదిరిగా ఉన్నాయి. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటోంది.

(ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి)

మలయాళంలో 2019లో 'పొరింజు మరియమ్ జోస్' అనే సినిమా వచ్చింది. అక్కడ హిట్ అయింది. దీన్ని తెలుగు నేటివిటికీ తగ్గట్లు మార్చి 'నా సామి రంగ' సినిమా తీశారు. నాగార్జున హీరో కాగా.. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు చేశారు. ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ.. ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ట్రైలర్ విషయానికొస్తే.. సినిమా ఎలా ఉండబోతుందనేది చూపించారు. అయితే స్టోరీ పెద్దగా రివీల్ చేయలేదు. యాక్షన్ మాత్రం గట్టిగానే ఉన్నట్లు అర్థమైంది. ఇక ఫన్‌తో పాటు డ్రామా, రూరల్ కల్చర్ తదితర విషయాలు సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలో సంక్రాంతి ప్రస్తావన కూడా ఉంది. చివర్లో నాగ్.. బాగా మండిన గునపంతో సిగరెట్ వెలిగించుకునే షాట్ బాగుంది. ట్రైలర్ చూస్తే బాగానే ఉంది. మరి సినిమా ఏం చేస్తుందనేది జనవరి 14న తెలుస్తుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement