Nagarjuna The Ghost Lengthy Schedule Completed In Dubai, Details Here - Sakshi
Sakshi News home page

Nagarjuna Ghost: విజువల్‌ ఫీస్ట్‌లా ‘ది ఘోస్ట్‌’

Mar 31 2022 10:29 AM | Updated on Mar 31 2022 12:48 PM

Nagarjuna The Ghost  Lengthy Schedule In Dubai Completed - Sakshi

నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్‌’. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ,  నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్లపై నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా దుబాయ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్‌ చిత్రాలు, విజువల్‌ ఫీస్ట్‌లు ఆస్వాదించేవారికి ‘ది ఘోస్ట్‌’ కొత్త అనుభవాన్ని కలిగిస్తుంది. దుబాయ్‌లో కీలకమైన షెడ్యూల్‌లో భాగంగా హై ఇంటెన్స్‌ స్టంట్‌ సీక్వెన్స్, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరించాం. ముఖ్యంగా ఎడారిలో చేసిన యాక్షన్‌ సీక్వెన్సెస్‌ సినిమాలో హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement