Naga Shaurya Krishna Vrinda Vihari First Look Poster Released - Sakshi
Sakshi News home page

Naga Shaurya: బర్త్‌డే గిఫ్ట్‌ అదిరిందిగా

Jan 22 2022 1:57 PM | Updated on Jan 22 2022 4:07 PM

Naga Shaurya Upcoming Movie Krishna Vrinda Vihari First Look Out - Sakshi

యంగ్ హీరో నాగశౌర్య  పుట్టినరోజు కానుకగా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ. నటుడుగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న నాగ శౌర్య  ప్రస్తుతం నాలుగు మూవీలతో బిజీబిజీగా ఉన్నాడు.  'కృష్ణ వ్రింద విహారి'  సరికొత్త మూవీలో  వెరైటీ లుక్‌తో  ప్రేక్షకులను అలరించనున్నాడు.

సాక్షి, హైదరాబాద్‌: యంగ్ హీరో నాగశౌర్య  పుట్టినరోజు కానుకగా  తనకొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ. నటుడుగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న నాగ శౌర్య  ప్రస్తుతం నాలుగు మూవీలతో బిజీబిజీగా ఉన్నాడు.   'కృష్ణ వ్రింద విహారి'  సరికొత్త మూవీలో  వెరైటీ లుక్‌తో  ప్రేక్షకులను అలరించనున్నాడు. తాజాగా విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో శౌర్య ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతున్నాడు. కృష్ణ వృంద ప్రేమ కథగా ఈ మూవీతెరకెక్కనుంది.(Naga Shaurya: టాలెంటెడ్‌ హీరో కెరియర్‌ అండ్‌ గ్రోత్‌ ఎలా ఉందంటే!)

అనీష్ ఆర్ కృష్ణ  దర్శకత్వంలో వస్తున్న మూవీలో షిర్లీ సేతియా హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే ఈ మూవీలో సినియర్‌ నటి రాధిక  ఒక ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ  ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు.  కాగా నాగశౌర్య తన లేటెస్ట్‌  ‘లక్ష్య, వరుడు కావలెను’ మూవీలను  ఓటీటీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement