
‘తండేల్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్‌సీ 24’ (వర్కింగ్ టైటిల్). కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర వేసిన గుహ సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నాగచైతన్య, మీనాక్షీలపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో అర్జున్ అనే ట్రెజర్ హంటర్‌గా కనిపిస్తాను. నాగేంద్రగారు గుహని అద్భుతంగా తీర్చిదిద్దారు’’ అని తెలిపారు. ‘‘ఈ గుహలో తీస్తున్న సీన్స్ సినిమాలో 20 నిమిషాలకు పైగా ఉంటాయి’’ అన్నారు కార్తీక్ వర్మ. ‘‘ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు మీనాక్షీ చౌదరి. ‘‘ప్రేక్షకులకు ఒరిజినల్ సినిమాటిక్ అనుభూతినిచ్చేందుకు గుహ సెట్ వేసి, సీన్స్ తీస్తున్నాం’’ అని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ చెప్పారు. ‘‘ప్రేక్షకులకు సెట్ అనే భావన కలగకుండా50 రోజులు కష్టపడి ఈ సెట్‌ని సహజంగా తీర్చిదిద్దాం’’ అని నాగేంద్ర పేర్కొన్నారు. ఫైట్ మాస్టర్ విజయ్ పాల్గొన్నారు.