Naga Chaitanya: భవిష్యత్తులో సమంతతో నటిస్తారా? నాగ చైతన్య షాకింగ్‌ రియాక్షన్‌

Naga Chaitanya Open Up on Working With His Ex Wife Samantha In Future - Sakshi

అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘లాల్‌ సింగ్‌ చద్దా’ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో చై బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌ కార్యక్రమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంగ్లిష్‌ చానల్‌తో ముచ్చటించాడు నాగ చైతన్య. ఈ సందర్భంగా  చిత్ర విశేషాలను పంచుకున్నాడు. ఇక అలాగే అందరు ఊహించినట్టే చైకి విడాకులపై ప్రశ్న ఎదురవగా ఆసక్తికరంగా స్పందించాడు. 

చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు మృతి

‘నా వ్యక్తిగత జీవితం గురించి అందరు మాట్లాడుకోవడం అసహనం కలిగిస్తోంది. ప్రతి ఒక్కరికీ పర్సనల్‌ లైఫ్‌ అనేది ఉంటుంది. సమంతతో విడాకులపై ఇప్పటికే ప్రకటన చేశాం. అయితే దానికి కారణమేంటో ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు జీవిస్తున్నాం. సమంత దారి సమంతదే.. నా దారి నాదే. ఇంతకంటే ఇంకా చెప్పాల్సిందేమి లేదు’ అంటూ ఘాటూగా స్పందించాడు. అనంతరం తనపై వస్తున్న రూమర్స్‌ని తానేప్పుడు పట్టించుకోనని, మొదట్లో ఆలోచించేవాడినని, కానీ ఇప్పుడు ఆ రూమర్స్ గురించి అంతగా ఆలోచించడం లేదని చై అన్నాడు. 

చదవండి: Hero Suman: షూటింగ్‌లతో బిజీ.. రాజకీయాల్లోకి..?

తన బెస్ట్‌ ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ సమంతోనే కుదరిందని గతంలో చై చెప్పిన సమాధానంపై ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ప్రశ్న ఎదరురైంది. భవిష్యత్తులో సమంత నటించే అవకాశం ఉందా? అడగ్గా చై గట్టిగా నవ్వేశాడు. ‘ఒకవేళ అలా జరిగితే చాలా క్రేజీగా ఉంటుందేమో.. కానీ అది జరుగుతుందో లేదో నాకు తెలియదు.. ఈ ప్రపంచానికే తెలియాలి’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక లాల్‌ సింగ్‌ చద్దా మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తన పాత్ర చాలా ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతుందన్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top