అక్కడ చూసినప్పుడు చాలా అసౌకర్యంగా ఫీలయ్యా : నటి‌

Naagin- 4 Actress Sayantani Ghosh Slams Troll Asking Her Bra Size - Sakshi

నీచమైన ప్రశ్న అడిగిన నెటిజన్‌..నటి దిమ్మతిరిగే కౌంటర్‌

సోషల్‌ మీడియా వాడకం పెరిగాక ఈ మధ్య సినీతారలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. పబ్లిక్‌గా చెత్త కామెంట్లు చేయడానికి సైతం కొందరు నెటిజన్లు వెనకడుగు వేయడం లేదు. కొందరు స్టార్స్‌ వీటిని చూసీ, చూడనట్లు వదిలేస్తుంటే..మరికొందరు మాత్రం తగిన సమాధానం చెప్పి వాళ్ల  నోరు మూయిస్తారు. తాజాగా టీవీ నటి సయాంతనీ ఘోష్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. బుధవారం(నిన్న)ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆరోగ్యం, పాజిటివ్‌ ఆటిట్యూడ్‌ వంటి విషయాలపై నెటిజన్లతో చర్చిస్తుండగా, అందులో ఓ నెటిజన్‌ తన వంకర బుద్దిని బయటపెట్టాడు.

నీ లోదుస్తుల సైజ్‌ ఎంత అడిగిన నెటిజన్‌కు సయాంతనీ దిమ్మతిరిగే జవాబిచ్చింది. 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో నాకు అర్థమైంది. నువ్వు మానసికంగా ఇంకా ఎదగాలి. నువ్వు నా లో దుస్తుల సైజు అడిగావు.. నేను కూడా నీ అంగం సైజు ఎంత అని అడిగి ఉంటే అప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? సైజుల గురించి మాట్లాడుకోవడం ఇకనైనా ఆపేయాలి. గతంలో నాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మగవాళ్లు నా వక్షోజాలను తదేకంగా చూస్తున్నప్పుడు నేను చాలా అసౌకర్యానికి గురయ్యాను.

ఇక చాలు..మనల్ని మనం ప్రేమించాల్సిన అవసరం చాలా ఉంది. మన శరీరం ఎలాంటి సైజ్‌లో ఉన్నా దాన్ని యాక్సెప్ట్‌ చేయండి. ఎవరైనా మిమ్మల్ని అగౌరవించాలని చూసినా, బాడీ షేమింగ్‌ చేసినా వారికి గట్టి బదులివ్వండి' అంటూ అదిరిపోయే ఆన్సర్‌ ఇచ్చింది. ఇక సయాంతనీ చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. మీరు ఇచ్చిన రిప్లై చాలా ఇంప్రెసివ్‌గా ఉందంటూ సయాంతనీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఘర్ ఏక్ సప్నా, నాగిని వంటి సీరియల్స్‌తో సయాంతనీ పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. 

చదవండి : న్యూడ్‌ ఫోటో అడిగిన నెటిజన్‌.. అలా చేస్తే ఓకే అన్న ప్రియమణి
న్యూడ్‌ ఫోటో అడిగిన నెటిజన్‌..షేర్‌ చేసిన యాంకర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top