న్యూడ్‌ ఫోటో అడిగిన నెటిజన్‌..షేర్‌ చేసిన యాంకర్‌

Anchor Srimukhi Smart Answer To The Netizen Who Asked Her Naked Pic - Sakshi

టాలీవుడ్‌లో టాప్‌ యాంకర్‌గా దూసుకుపోతున్న శ్రీముఖి..అప్పుడప్పుడు వెండితెరపై కూడా సందడి చేస్తుంటుంది. హీరోయిన్‌ అవ్వాలన్న లక్ష్యంతో  సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడుకు వెండితెర అంతగా కలిసి రాకపోయినా, బుల్లితెరపై మాత్రం ఫుల్‌ బిజీబిజీగా గడుపుతోంది. తనదైన యాంకరింగ్‌తో అలరించే శ్రీముఖి..ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తుంటుంది. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్ చాటింగ్ సందర్భంగా ఓ నెటిజన్‌ అడిగిన తుంటరి ప్రశ్నకి శ్రీముఖి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది.

నగ్నంగా ఉన్న ఫోటో షేర్‌ చేయాల్సిందిగా ఓ అభిమాని కోరగా.. ఇందుకు రిప్లై ఇచ్చిన శ్రీముఖి..వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘నగ్నం' సినిమా పోస్టర్‌ను షేర్‌చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో శ్రీముఖి స్మార్ట్‌ ఆన్సర్‌కి నెటిజన్లు ఫిదా అయ్యారు. సూపర్భ్‌ శ్రీముఖి..వాట్‌ ఎ రిప్లై అంటూ పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇక ఇటీవలె వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన శ్రీముఖి.. ‘లువీ’ అనే పేరుతో బ్యూటీ ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి ప్రవేపెట్టిన సంగతి తెలిసిందే. 

చదవండి : (వీడియోకాల్‌ మాట్లాడుతుండగా నటి రూమ్‌లోకి..)
(పిల్లల్ని కనాలని ఉంది: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top