800 Movie: విక్టరీ వెంకటేశ్‌ను కెప్టెన్‌ చేయాలి, ఆరోజు లక్ష్మణ్‌ ఏం చేశాడంటే?.. ముత్తయ్య మురళీధరన్‌

Muttiah Muralitharan Biopic 800 Movie Pre Release Event Highlights - Sakshi

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీలో మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది.

నాకు బ్రదర్ కంటే ఎక్కువ: లక్ష్మణ్‌
సోమవారం నాడు హైదరాబాద్‌లో '800' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీవీఎస్‌ లక్ష్మణ్‌ చేతుల మీదుగా బిగ్ టికెట్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ''మైదానంలో మురళీధరన్ సాధించినది మాత్రమే కాదు, అతని జీవితం అంతా ఇన్‌స్పిరేషన్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి మురళీధరన్ మెంటార్ కూడా! అతనితో పాటు క్రికెట్ ఆడాను. అతనికి అపోజిట్ టీంలో ఆడాను. మురళీధరన్ గొప్ప క్రికెటర్ అని అందరికీ తెలుసు. అంత కంటే గొప్ప మనసు ఉన్న వ్యక్తి, నిగర్వి. ఈతరం యువతకు రోల్ మోడల్. నాకు బ్రదర్ కంటే ఎక్కువ. అతనిలాంటి ఫ్రెండ్ ఉండటం లక్కీ. మురళీధరన్ కి క్రికెట్టే జీవితం'' అని అన్నారు.

లక్ష్మణ్‌తో అలాంటి అనుబంధం: ముత్తయ్య
ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ ''1998లో ఫస్ట్ టైమ్ లక్ష్మణ్‌ను చూశా. ఒరిస్సాలోని కటక్‌లో మ్యాచ్ ఆడాం. నా కంటే వయసులో లక్ష్మణ్ చిన్న. అప్పుడు టీనేజర్ అనుకుంట! అప్పుడే తన ఆటతో లక్ష్మణ్ అందరికి షాక్ ఇచ్చాడు. ఈ అబ్బాయి ఇండియన్ టీంలో ఎందుకు లేడని అనుకున్నా. ఆ తర్వాత చాలాసార్లు కలిశాం. స్పిన్ ఆడటంలో లక్ష్మణ్ మేటి. మేం మైదానంలో వేర్వేరు దేశాలకు ఆడినప్పటికీ... మైదానం బయట సచిన్, అనిల్ కుంబ్లే, గంగూలీ అంతా స్నేహితులుగా ఉన్నాం. క్రికెట్ అంటే రికార్డులు కాదు... స్నేహితుల్ని చేసుకోవడం!

వెంకటేశ్‌ను కెప్టెన్‌ చేయాలి
హైదరాబాద్ నాకు స్పెషల్... నేను ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి పని చేయమని అడిగారు. ఒకసారి టీం అంతా హైదరాబాద్ నుంచి వేరే సిటీకి వెళుతున్నాం. సరదాగా బిర్యానీ అడిగా. అరగంటలో విమానంలో చాలా బిర్యానీలు ఉన్నాయి. లక్ష్మణ్ అంటే అది'' అని చెప్పారు. ఇండియన్ సెలబ్రిటీలతో క్రికెట్ టీం ఏర్పాటు చేయాల్సి వస్తే... ఎవరెవరిని ఎంపిక చేస్తారని అడగ్గా ''వెంకటేష్ ను కెప్టెన్ చేయాలి. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మిస్ కారు'' అని మురళీధరన్ చెప్పారు. నానితో ఒకసారి మాట్లాడానని ఆయన తెలిపారు.

విజయ్‌ సేతుపతిని బెదిరించారు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముత్తయ్య మురళీధరన్‌ కీలక విషయాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 'విజయ్ సేతుపతితో '800' తీయాలని అనుకున్నాం. ఆయన కూడా అందుకు ఒప్పుకున్నారు. కానీ ఇది ఇష్టం లేని కొందరు నాయకులు ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. తన కుటుంబాన్ని బెదిరించారు. దీంతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: రెండుసార్లు బ్రేకప్‌, డిప్రెషన్‌లో.. కాంట్రాక్టు మీద సంతకం పెట్టాక రాత్రికి రమ్మనేవాళ్లు!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top