ముక్కు అవినాష్‌ తల్లికి అనారోగ్యం: CMRF‌ నుంచి చెక్‌ | Mukku Avinash Recieved CMRF Check | Sakshi
Sakshi News home page

ముక్కు అవినాష్‌కు తెలంగాణ ప్రభుత్వం సాయం

Mar 28 2021 2:44 PM | Updated on Mar 28 2021 3:22 PM

Mukku Avinash Recieved CMRF Check - Sakshi

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కంటెస్టెంట్‌, జబర్దస్త్‌ కమెడియన్‌ ముక్కు అవినాష్‌ తల్లి అనారోగ్యానికి లోనైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆమె వైద్యానికి అవసరమయ్యే డబ్బును చెక్‌ రూపంలో అందించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ళ లక్ష్మిరాజం (ముక్కు అవినాష్ తల్లి) అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 60 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నగదుకు సంబంధించిన చెక్కును శనివారం నాడు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ లక్ష్మీరాజం కుమారుడు అవినాష్‌కు అందజేశారు. అనంతరం ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

కాగా అవినాష్‌ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తూ ప్రేక్షకులకు నాన్‌స్టాప్‌ కామెడీని పంచాడు. అరియానాతో స్నేహం చేస్తూ మోనాల్‌ను ఆటపట్టిస్తూ తెగ సందడి చేసిన అతడు ప్రస్తుతం పలు ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

చదవండి: 'అవ్వ బంగారం' అంటూ అఖిల్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

'‌‌ఆర్‌ఆర్‌ఆర్'‌ నుంచి రామ్‌చరణ్‌కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement