'‌‌ఆర్‌ఆర్‌ఆర్'‌ నుంచి రామ్‌చరణ్‌కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

Ram Charan Celebrates His Birthday On RRR Sets With SS Rajamouli - Sakshi

పుట్టినరోజు (మార్చి 27) కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు హీరో రామ్‌చరణ్‌. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌.ఆర్‌.ఆర్‌). ప్రసుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చరణ్‌ షూటింగ్‌ స్పాట్‌లోకి అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి రామ్‌చరణ్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. ఆ తర్వాత చరణ్‌ చేత కేక్‌ కట్‌ చేయించారు. అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌తో పాటు హీరోగా నటిస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ షేర్‌ చేసిన ఫోటో వైరల్‌ అవుతోంది.  చదవండి: (రామ్‌ చరణ్‌ బర్త్‌డే: మెగాస్టార్‌ ఎమోషనల్‌ వీడియో‌)


రాజమౌళి, రామ్‌చరణ్

‘‘ఈ ఏడాది మా ఇద్దరికీ జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుంది. నీతో గడిపిన సమయాలు ఎప్పుడూ సంతోషకరమైనవే బ్రదర్‌ (రామ్‌చరణ్‌ను ఉద్దేశిస్తూ). హ్యాపీ బర్త్‌ డే. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరిన్ని జరుపుకోవాలి’’ అని సోషల్‌ మీడియా వేదికగా స్పందిచారు ఎన్టీఆర్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అక్టోబరు 13న విడుదల కానుంది. మరోవైపు రామ్‌చరణ్‌ అభిమానులు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో చరణ్‌ బర్త్‌ డే వేడుకలను జరిపారు. ఈ వేడుకలో సాయిధరమ్‌ తేజ్, వైష్ణవ్‌ తేజ్, ప్రముఖ నిర్మాతలు ‘దిల్‌’ రాజు, నవీన్‌ ఎర్నేని, దర్శకుడు బుచ్చిబాబులతో పాటు పలువురు పాల్గొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top