విజిల్స్‌ వేసే సన్నివేశాలుంటాయి | Mr.King Movie will release on 24th | Sakshi
Sakshi News home page

విజిల్స్‌ వేసే సన్నివేశాలుంటాయి

Feb 22 2023 1:05 AM | Updated on Feb 22 2023 1:05 AM

Mr.King Movie will release on 24th - Sakshi

‘‘ఫ్యామిలీ అండ్‌ యూత్‌కి కనెక్ట్‌ అయ్యే సినిమా ‘మిస్టర్‌ కింగ్‌’. సెకండ్‌ హాఫ్‌లో యూత్‌ విజిల్స్‌ వేసి చప్పట్లు కొట్టే సన్నివేశాలుంటాయి. క్లైమాక్స్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది’’ అని డైరెక్టర్‌ శశిధర్‌ చావలి అన్నారు. శరణ్‌ కుమార్, యశ్విక  నిష్కల, ఊర్వీ సింగ్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘మిస్టర్‌ కింగ్‌’.

బీఎన్‌ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శశిధర్‌ చావలి మాట్లాడుతూ– ‘‘నా ఇష్టం’ చిత్రంతో సహాయ దర్శకుడిగా నా ప్రయాణం మొదలుపెట్టాను. ‘బాహుబలి 1’కి ఎడిటింగ్‌ డిపా ర్ట్‌మెంట్‌లో చేశాను. ఆ తర్వాత విరించితో కలసి ‘మజ్ను’ సినిమాకి పని చేశాను.

అనంతరం ‘మిస్టర్‌ కింగ్‌’ చాన్స్‌ వచ్చింది. మంచి క్యారెక్టర్‌ ఉన్న ఓ కుర్రాడి ప్రయాణమే ఈ చిత్రం. ప్రేమకు సంబంధించిన కథ. సామాన్య ప్రేక్షకుడు తనని తాను హీరోగా చూసుకునేలా హీరోపాత్ర ఉంటుంది. మిస్టర్‌ కింగ్‌ పాత్రకి శరణ్‌ చక్కగా సరిపోయాడు. బీఎన్‌ రావుగారు ఎక్కడా రాజీపడలేదు. మణిశర్మ గారి నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement