వినాయకచవితికి కొత్త పాట.. వరలక్ష్మి విశ్వరూపం | Mr Celebrity: Varalakshmi Sarathkumar Gajanana Song Released | Sakshi
Sakshi News home page

వినాయకచవితికి కొత్త పాట.. మంగ్లీ పాటకు వరలక్ష్మి శరత్‌కుమార్‌ స్టెప్పులు

Sep 5 2024 7:34 PM | Updated on Sep 5 2024 8:15 PM

Mr Celebrity: Varalakshmi Sarathkumar Gajanana Song Released

సుదర్శన్ పరుచూరి హీరోగా నటిస్తున్న చిత్రం మిస్టర్ సెలెబ్రిటీ. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. వినాయక చవితి స్పెషల్‌గా తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి ఓ హుషారైన భక్తి పాటను రిలీజ్ చేశారు.

ఇంత ఎనర్జీగా..
‘గజానన’ అంటూ సాగే ఈ పాటను మంగ్లీ ఆలపించారు. ఈ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ వేసిన స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. చాలా రోజుల తరువాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంత ఎనర్జీగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వినోద్ ఇచ్చిన బాణీకి గణేశ్‌ లిరిక్స్‌ అందించాడు. 

ఈ పాట మార్మోగడం ఖాయం
ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఈ పాట మార్మోగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఎన్. పాండురంగారావు, చిన్నరెడ్డయ్య సంయుక్తంగా ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ ప్రకటించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement