‘సినిమా’ వేళల్లో మార్పులు

Movie Theatre Show Timings Changed Due To Curfew In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లను కూడా రాత్రి 8 గంటలకే మూసివేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని మల్టీప్లెక్సులు, థియేటర్లు, సినిమా హాళ్లను 8 గంటలకే మూసేయాలి. వాటి సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రవేశద్వారాల వద్ద తప్పనిసరిగా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. సామాజిక దూరం పాటించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. థియేటర్లలో 24 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత, 40–70 శాతం తేమ, లోపలికి, బయటికి గాలి ప్రసరించేలా ఏర్పాట్లు చేయాలి. ఇంటర్వెల్, ముగింపు సమయంలో ప్రేక్షకులు భారీగా గుమిగూడకుండా చూడాలి. 

షోల సమయాల్లో మార్పులు
రాత్రి కర్ఫ్యూ విధిస్తూ మంగళవారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. సినిమా థియేటర్ల యజమానులు సెకండ్‌ షోను రద్దు చేసుకున్నారు. మిగతా మూడు షోల సమయాన్ని సవరించారు. మార్నింగ్‌ షో ఉదయం 11 గంటలకు మొదలై మధ్యాహ్నం 1.30గంటల వరకు.. మ్యాట్నీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు.. ఫస్ట్‌ షోను 5 గంటలకు మొదలై రాత్రి 8 గంటలలోపు ముగించేలా మార్చారు.  అయితే తెలంగాణ సినిమా థియేటర్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ మాత్రం కొవిడ్ ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా నేటి (బుధవారం) నుంచి రాష్ట్రంలో సినిమా ప్రదర్శనలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

చదవండి: కరోనా కష్టాలు మామ.. సినిమా చూపలేము మామా!

రష్మికకు ప్రపోజ్‌ చేసిన రౌడీ హీరో.. వీడియో వైరల్

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top