సినీ ప్రముఖ రచయిత చిన్నికృష్ణ ఇంట తీవ్ర విషాదం జరిగింది. ఆయన తల్లి సుశీల (75) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. చిన్నికృష్ణ స్వగ్రామం  తెనాలిలో నేడు అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి మదర్స్‌డే నాడు ఆయన తన తల్లి గురించి చాలా ఎమోషనల్‌గా కవితలు రాశారు. ఎన్ని జన్మలైనా నీకే జన్మించాలని ఉందంటూ తన తల్లి గురించి చెప్పే వారు. సుశీల మరణంతో  సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. గంగోత్రి,బద్రినాథ్,నరసింహనాయుడు,ఇంద్ర వంటి చిత్రాలకు ఆయన కథ అందించారు.
 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
