Monster Hunter Movie Release Date In India Announced | ఫిబ్రవరి 5న ‘మాన్‌స్టర్‌ హంటర్‌’ - Sakshi
Sakshi News home page

ఇద్దరు వీరుల పోరాటం

Jan 27 2021 8:59 AM | Updated on Jan 27 2021 1:46 PM

Monster Hunter Released On February 5th - Sakshi

మిలా జొవోవిచ్, టోనీ జా ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘మాన్‌స్టర్‌ హంటర్‌’. పాల్‌ డబ్ల్యూఎస్‌ అండర్సన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ, తెలుగులో ఫిబ్రవరి 5న విడుదల చేస్తున్నట్లు పంపిణీదారులు సోనీ పిక్చర్స్‌ తెలిపింది. ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వివేక్‌ కృష్ణాని మాట్లాడుతూ– ‘‘విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన సినిమా ఇది. ప్రఖ్యాత వీడియో గేమ్‌ ‘మాన్‌స్టర్‌ హంటర్‌’ ఆధారంగా ఈ సినిమాను అదే పేరుతో రూపొందించారు క్లిఫోర్డ్‌ టీఐ హ్యారిస్‌.

అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన మాన్‌స్టర్స్‌ను ఎదుర్కొనేందుకు ఇద్దరు వీరులు చేసిన పోరాటమే ఈ చిత్రకథ. ఇలాంటి చిత్రాలను తెరపైనే చూడాలి. త్రీడీ సాంకేతికత ప్రేక్షకులకు మరింత సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. మా ఎగ్జిబిటర్స్‌ థియేటర్లలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇండియా అంతటా ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది’’అన్నారు. జూనియర్‌ మీగాన్‌ గుడ్, డియాగో బోనెట, జోష్‌ హెల్‌ మ్యాన్, జిన్‌ ఉ యూంగ్‌ మెక్‌ జిన్, రాన్‌ పెర్ల్‌ మ్యాన్‌ ఇతర పాత్రల్లో నటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement