షో నుంచి తప్పుకున్న నటి.. నిర్మాతలపై సంచలన ఆరోపణలు! | Sakshi
Sakshi News home page

Monika Bhadoriya: ఆమెను కూడా వేధించి ఉంటారు.. అందుకే ఇలా: మోనికా

Published Tue, Jun 13 2023 6:35 PM

Monika Bhadoriya hints Disha Vakani faced bad behaviour on sets - Sakshi

హిందీలో పాపులర్ షో అయినా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను కూడా సంపాదించుకుంది తారక్ మెహతా కా ఉల్టా చష్మా. అయితే ఈ షో నుంచి నటీనటులు ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఇప్పటికే మోనికా భదోరియా, ప్రియా అహుజా, శైలేష్ లోధా ఈ షో నుంచి తప్పుకోగా.. తాజాగా మరో నటి దిశా వకాని కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తాజాగా దిశా వకానీ ఉల్టా చష్మా నుంచి నిష్క్రమించడంపై మోనికా సంచలన ఆరోపణలు చేసింది.

(ఇది చదవండి: పెళ్లికి ముందే వరుణ్‌కు లావణ్య కండీషన్‌.. మెగా ఫ్యామిలీ గ్రీన్‌ సిగ్నల్‌!)

దిశా వకానీని కూడా వేధించారు: మోనికా

తనలాగే దిశా వకానికి వేధింపులు ఎదురై ఉండవచ్చని మోనికా కామెంట్స్ చేసింది. దిశా వకాని షో నుంచి తప్పుకోవడంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. దిశా వకానీ షోకు తిరిగిరాలేదని ఆమెకు డబ్బులు కూడా చెల్లించకపోయి ఉండొచ్చని తెలిపింది. అందువల్లే తాను కూడా వేధింపులు భరించలేకే షో నుంచి తప్పుకుని ఉంటుందని మోనికా వ్యాఖ్యానించింది. 

అయితే గతంలో ఈ షో నిర్మాతలపై మోనికా భదోరియా సంచలన కామెంట్లు చేసింది. ఆ షోలో పనిచేస్తున్నప్పుడు తనను హింసించారని.. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చినట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తనతో వెట్టి చాకిరి చేయించుకున్నారు అని కానీ చివరకు రావాల్సిన రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తారక్ మెహతా కా ఉల్టా చష్మాలో మోనికా భదోరియా.. బావ్రీ పాత్రతో మెప్పించింది.  ‍అయితే ఇప్పటికే ఈ షో నిర్మాతలు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని మరో నటి జెన్నిఫర్ మిస్త్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. 

నరకం అనుభవించా: మోనికా భదోరియా

ఈ నటి తన షో సెట్‌లో నరకం అనుభవించానని మోనికా చెప్పుకొచ్చింది. అయితే చివరకు తల్లి క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నప్పుడు కూడా తనకు ఎలాంటి మద్దతు లభించలేదని పేర్కొంది. రాత్రంతా ఆస్పత్రిలో అమ్మ వద్దే ఉండేదాన్ని.. వారంతా కావాలనే షూటింగ్ కోసం ఉదయాన్నే పిలిచేవారని తెలిపింది. నా మానసిక స్థితి బాగా లేకున్నా.. రమ్మని బలవంతం చేసేవారని.. ఎదురు ప్రశ్నించలేక షూట్ కోసం వెళ్తే అక్కడ కూడా నన్ను వెయిట్ చేయించేవారు అంటూ కన్నీరు పెట్టుకుంది నటి.

(ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!)


 

Advertisement
 
Advertisement
 
Advertisement