వృషభ.. మళ్లీ ఆ రేంజ్‌లో యాక్షన్‌ సీన్స్‌! | Mohan lal Vrushabha wraps it first shooting schedule | Sakshi
Sakshi News home page

'మన్యం పులి' తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో వృషభలో యాక్షన్‌ సీన్స్‌!

Published Sat, Aug 26 2023 12:44 AM | Last Updated on Sat, Aug 26 2023 11:07 AM

Mohan lal Vrushabha wraps it first shooting schedule - Sakshi

మోహన్‌లాల్, రోషన్‌ మేకా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ద్విభాషా (తెలుగు, మలయాళం) చిత్రం ‘వృషభ’. ‘ది వారియర్‌ అరైజ్‌’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో జహ్రా ఖాన్, శనయ కపూర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నంద కిషోర్‌ దర్శకత్వంలో అభిషేక్‌ వ్యాస్, విశాల్‌ గుర్నాని, జుహి పరేఖ్‌ మెహతా, శ్యామ్‌ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్‌ మథూర్, సౌరభ్‌ మిశ్రా నిర్మాతలు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తయింది.

‘‘తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం ఉంటుంది. ‘మన్యం పులి’ తర్వాత మోహన్‌లాల్, పీటర్‌ హెయిన్స్‌ కాంబినేషన్‌లో ఆ తరహా యాక్షన్‌ సీన్స్‌ అలరిస్తాయి. హాలీవుడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ నిక్‌ తుర్లో మా సినిమాకు వర్క్‌ చేస్తున్నారు’’ అని యూనిట్‌ పేర్కొంది. శ్రీకాంత్‌ మేకా, రాగిణి ద్వివేది తదితరులు కీలక పాత్రల్లో తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం హిందీ, కన్నడ, తమిళ భాషల్లో 2024లో రిలీజ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement