వారికోసమే సినిమాలు చేస్తున్నట్లు ప్రచారం.. నేను దానికోసం ఇండస్ట్రీకి రాలేదు

Mohan g About Pa Ranjith In Bakasuran Movie Press Meet - Sakshi

తాను దర్శకుడు పా. రంజిత్‌కు వ్యతిరేకిని కాదని దర్శక నిర్మాత మోహన్‌ జి పేర్కొన్నారు. ఇంతకుముందు పళయ వన్నారపేటై, ద్రౌపది, రుద్రతాండవం వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజాగా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం బకాసురన్‌. దర్శకుడు సెల్వ రాఘవన్‌ కథానాయకుడు. నట్టి, రాధా రవి, కే రాజన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని, ఫరూక్‌ చాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్రం యూనిట్‌ చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

సెల్వ రాఘవన్‌ మాట్లాడుతూ.. ప్రతిభ లేకపోతే ఎవరూ కథానాయకులుగా సక్సెస్‌ కాలేరన్నారు. మోహన్‌ జి కఠిన శ్రమజీవి, ప్రతిభావంతుడు అని, సినిమాపై ఎంతో మర్యాద, నమ్మకం కలిగిన మంచి దర్శకుడు అని ప్రశంసించారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన దర్శకుడు మోహన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. చిత్ర దర్శక నిర్మాత మోహన్‌.జీ మాట్లాడుతూ.. బకాసురం చిత్రం చాలా మంది ప్రశంసించారని, అందుకు తనతోపాటు పనిచేసిన అందరూ కారణమని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు శ్యామ్‌ సీఎస్, చాయాగ్రాహకుడు ఫరూక్‌ ముఖ్యమైన వారన్నారు.

సెల్వ రాఘవన్‌ సైలెంట్‌గా ఉంటారని.. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని తెలిపారు. అయితే, ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో తాను సెల్వరాఘవన్‌ చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం అని చెప్పారు. సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించిన కాదల్‌ కొండేన్‌ చిత్రాన్ని చూసిన తర్వాతే తనకు దర్శకుడు కావాలన్న కోరిక కలిగిందని చెప్పారు. లేకపోతే తాను ఒక వర్గానికి సంబంధించిన కథా చిత్రాలనే చేస్తానని ప్రచారం ఉందన్నారు. అందుకోసం తాను సినిమాలోకి రాలేదని స్పష్టం చేశారు. దర్శకుడు పా.రంజిత్‌ బడుగు వర్గాల ఇతివృత్తాలతోనూ, తాను ఓబీసీ ప్రజల కోసం చిత్రాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని, అయితే సినీ పరిశ్రమలో తాను ఎవరిని వ్యతిరేకులుగా భావించడం లేదని, ముఖ్యంగా దర్శకుడు పా.రంజిత్‌కు తాను వ్యతిరేకిని కాదని స్పష్టం చేశారు. బకాసురన్‌ అందరి చిత్రం అని దర్శక నిర్మాత మోహన్‌.జి పేర్కొన్నారు.

చదవండి: నా మనసు నిండా, ప్రతి ఆలోచనలోనూ నువ్వే.. శృతిహాసన్‌ పోస్ట్‌ వైరల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top