breaking news
Pa.Ranjith
-
పా.రంజిత్‌కు నేను వ్యతిరేకిని కాదు: దర్శకుడు
తాను దర్శకుడు పా. రంజిత్‌కు వ్యతిరేకిని కాదని దర్శక నిర్మాత మోహన్ జి పేర్కొన్నారు. ఇంతకుముందు పళయ వన్నారపేటై, ద్రౌపది, రుద్రతాండవం వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజాగా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం బకాసురన్. దర్శకుడు సెల్వ రాఘవన్ కథానాయకుడు. నట్టి, రాధా రవి, కే రాజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ఫరూక్ చాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్రం యూనిట్ చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సెల్వ రాఘవన్ మాట్లాడుతూ.. ప్రతిభ లేకపోతే ఎవరూ కథానాయకులుగా సక్సెస్ కాలేరన్నారు. మోహన్ జి కఠిన శ్రమజీవి, ప్రతిభావంతుడు అని, సినిమాపై ఎంతో మర్యాద, నమ్మకం కలిగిన మంచి దర్శకుడు అని ప్రశంసించారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన దర్శకుడు మోహన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. చిత్ర దర్శక నిర్మాత మోహన్.జీ మాట్లాడుతూ.. బకాసురం చిత్రం చాలా మంది ప్రశంసించారని, అందుకు తనతోపాటు పనిచేసిన అందరూ కారణమని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్, చాయాగ్రాహకుడు ఫరూక్ ముఖ్యమైన వారన్నారు. సెల్వ రాఘవన్ సైలెంట్‌గా ఉంటారని.. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని తెలిపారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ సమయంలో తాను సెల్వరాఘవన్ చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం అని చెప్పారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన కాదల్ కొండేన్ చిత్రాన్ని చూసిన తర్వాతే తనకు దర్శకుడు కావాలన్న కోరిక కలిగిందని చెప్పారు. లేకపోతే తాను ఒక వర్గానికి సంబంధించిన కథా చిత్రాలనే చేస్తానని ప్రచారం ఉందన్నారు. అందుకోసం తాను సినిమాలోకి రాలేదని స్పష్టం చేశారు. దర్శకుడు పా.రంజిత్ బడుగు వర్గాల ఇతివృత్తాలతోనూ, తాను ఓబీసీ ప్రజల కోసం చిత్రాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని, అయితే సినీ పరిశ్రమలో తాను ఎవరిని వ్యతిరేకులుగా భావించడం లేదని, ముఖ్యంగా దర్శకుడు పా.రంజిత్‌కు తాను వ్యతిరేకిని కాదని స్పష్టం చేశారు. బకాసురన్ అందరి చిత్రం అని దర్శక నిర్మాత మోహన్.జి పేర్కొన్నారు. చదవండి: నా మనసు నిండా, ప్రతి ఆలోచనలోనూ నువ్వే.. శృతిహాసన్ పోస్ట్ వైరల్ -
అలాంటి డైలాగ్ చెబుతారా?
‘ఈ భాషా ఒక్కసారి చెప్తే.. వందసార్లు చెప్పినట్టే’ – ఇరవైయేళ్ల క్రితం విడుదలైన ‘భాషా’లోని ఈ డైలాగ్ ఇప్పటికీ జనాలకు గుర్తే. మరో ఇరవై కాదు.. వందేళ్లు గడిచినా ‘భాషా’ సినిమా, అందులో రజనీకాంత్ యాక్టింగ్, ఆయన డైలాగులను ప్రేక్షకులు మర్చిపోరంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘భాషా’తో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు రజనీ. ముంబై మాఫియా నేపథ్యంలో ఏదైనా సినిమా వస్తే ఆయన ఫ్యాన్స్‌కి ‘భాషా’ గుర్తొస్తుంది. ఇప్పుడీ సినిమా ప్రస్తావన ఎందుకంటే... మళ్లీ ముంబై నేపథ్యంలో రజనీ సినిమా చేయనున్నారట! రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ముంబై నేపథ్యంలో ఉంటుందట! అండర్‌వరల్డ్ మాఫియా నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ఇటీవల రజనీకాంత్, దర్శకుడు పా. రంజిత్, మరికొంత మంది యూనిట్ సభ్యులు ముంబై వెళ్లి లోకేషన్స్ ఫైనలైజ్ చేశారని చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. ఆల్రెడీ ‘కబాలి’లో రజనీకాంత్‌ని గ్యాంగ్‌స్టర్‌గా చూపించి ఆయన అభిమానులను పా. రంజిత్ ఖుషీ చేశారు. ఇప్పుడు ముంబై నేపథ్యం అనగానే, రజనీ అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇంకోసారి అభిమాన హీరో ‘ఈ భాషా ఒక్కసారి చెప్తే.. వందసార్లు చెప్పినట్టే’ అనే రేంజ్ డైలాగ్ చెబితే చూడాలని ఆశపడుతున్నారు. మరి, అలాంటి డైలాగ్ ఉంటుందా? వెయిట్ అండ్ సీ!