శివబాలాజీ భార్యపై మోహన్‌ బాబు సీరియస్‌ | Mohan Babu Serious On Shiva Balaji Wife Madhumitha | Sakshi
Sakshi News home page

Mohan Babu: శివబాలాజీ భార్యపై మోహన్‌ బాబు సీరియస్‌

Published Sun, Oct 17 2021 8:47 AM | Last Updated on Sun, Oct 17 2021 2:13 PM

Mohan Babu Serious On Shiva Balaji Wife Madhumitha - Sakshi

Mohan Babu Serious On Shiva Balaji Wife Madhumitha : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్‌ నటుడు మోహన్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటుడు శివబాలాజీ భార్య మధుమితపై సీరియస్‌ అయ్యారు. స్పీచ్‌ మధ్యలో వెనుక నుంచి మాట్లాడవద్దంటూ ఆగ్రహం ​వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: MAA Elections 2021: చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్‌

'నా జీవితం తెరిచిన పుస్తకం. నా పుస్తకంలో విలన్‌గా చెయ్యాలని అనుకున్నాను. విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, హీరోగా చేశాను. మనమంతా ఒకే తల్లి బిడ్డలం. మనుషుల్లో టాలెంట్‌ ఉంటే అవకాశాలు వస్తాయి. కేవలం టాలెంట్‌తోనే ఇక్కడ కొనసాగుతారు. ఇది రాజకీయ వేదిక కాదు. పాలిటిక్స్‌లో కంటే ఇక్కడే ఎక్కువ జరుగుతున్నాయి. ఇలాంటివి కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోయాను' అని మోహన్‌ బాబు పేర్కొన్నారు.

అయితే స్పీచ్‌ మధ్యలో శివబాలాజీ భార్య మధుమితపై సీరియస్‌ అయ్యారు. పెద్దలు స్పీచ్‌ ఇస్తుంటే వెనుక నుంచి గుసగుసలు, సైగలు చేయడం తనకు నచ్చదని కోప్పడ్డారు. ఇలా చేస్తే మాట్లాడాలనుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలకు బ్రేకులు పడతాయంటూ సున్నితంగా హెచ్చరించారు. 

చదవండి: ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయాను: మోహన్‌బాబు
ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ రాజీనామాలపై స్పందించిన మంచు విష్ణు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement