పొలిటికల్‌ మిషన్‌ | Mission 2020 Movie Updates | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ మిషన్‌

Feb 19 2021 3:31 AM | Updated on Feb 19 2021 3:31 AM

 Mission 2020 Movie Updates - Sakshi

నవీన్‌ చంద్ర హీరోగా హనీ బన్నీ క్రియేషన్స్, శ్రీ మిత్ర, మై విలేజ్‌ సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘మిషన్‌ 2020’. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ప్రేరణతో వాస్తవ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. కరణం బాబ్జీ దర్శకత్వంలో కుంట్లూర్‌ వెంకటేష్‌ గౌడ్, కేవీఎస్‌ఎస్‌ఎల్‌ రమేష్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 5న సినిమా విడుదల కానుంది. ‘‘ఈ సినిమాను చూసి ఏషియన్‌ ఫిలిమ్స్‌ విడుదల చేయడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు.

‘‘ఈ రోజుల్లో కూడా ఇలాంటి మంచి కాన్సెప్ట్‌ ఉన్న కథతో సినిమా తీయడం అంటే డేరింగ్‌ స్టెప్‌ అనుకోవచ్చు. సినిమా బాగా నచ్చింది కాబట్టి నైజాంలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు ఏషియన్‌ ఫిలిమ్స్‌ సునీల్‌ నారంగ్‌. ‘‘పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు కరణం బాబ్జీ. ‘‘ఇప్పటికే విడుదలైన పాటలు ఘనవిజయం సాధించాయి. సినిమా కూడా పెద్ద హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు కేవీఎస్‌ఎస్‌ఎల్‌ రమేష్‌ రాజు. ఎగ్జిబిటర్‌ శ్రీధర్, సంగీతదర్శకుడు ర్యాప్‌ రాక్‌ షకీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement