Men Too Telugu Movie Review And Rating - Sakshi
Sakshi News home page

Mentoo Movie: #మెన్‌టూ మూవీ రివ‍్యూ

Published Fri, May 26 2023 9:42 PM

Mentoo Movie Review Released Today - Sakshi

టైటిల్: #మెన్‌టూ(MenToo)
నటీనటులు : నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు  
రచన, దర్శకత్వం : శ్రీకాంత్ జి. రెడ్డి
నిర్మాత : మౌర్య సిద్ధవరం
సినిమాటోగ్రఫీ : పీసీ మౌళి
సంగీతం : ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్
విడుదల తేదీ: మే 26, 2023

నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం #MenToo. . శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు.  హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం నిర్మాతగా వ్యవహరించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం యూత్‌ను ఎలా అలరించిందో చూద్దాం .

అసలు కథేంటంటే..
ఓ నలుగురు యువకులు ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్), మున్నా(మౌర్య సిద్ధవరం), రాహుల్(వైవా హర్ష) నలుగురు యువకులు ఓ పబ్‌లో రెగ్యులర్ కలుసుకుని తమ జీవితాల్లో జరిగిన కష్టనష్టాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఆ పబ్ ఓనర్(బ్రహ్మాజి), అందులో పనిచేసే బాయ్(సుదర్శన్) కూడా వారి సాదక, బాధకాలు షేర్ చేసుకుంటారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో ఎక్సీపీరియన్స్. ఒకరు భార్య వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది షేర్ చేసుకుంటే... ఇంకొకరేమో తనను అనవసరంగా వేధింపులతో తనువు చాలించడం... మరొకరేమో విదేశాలకు వెళ్లడం ఇష్టం లేక ప్రియురాలికి దూరం కావడం... ఒకరేమో ప్రియురాలి ఎక్స్‌పేక్టేషన్స్ అందుకోలేకపోవడం లాంటి సమస్యలతో ఇబ్బందులు పడే మగాళ్లంతా... చివరకు ఏమి చేశారనేదే మిగతా కథ. 

కథ ఎలా సాగిందంటే.. 

 యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్‌కి మంచి ఆదరణే ఉంటుంది. ఇలాంటి సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. కొంచెం మెసేజ్ ఓరియంటెడ్‌గా సినిమా తీస్తే... యూత్ బాగా ఆదరిస్తారని ఇది వరకు చాలా సినిమాలు నిరూపించాయి. అలాంటి సినిమానే #MenToo. కేవలం అమ్మాయిలే కాదు... వేధింపులకు గురై బాధపడే అబ్బాయిలు కూడా ఉంటారు అనే నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నిత్యం మనం చుట్టూ యువతీ యువకుల్లో జరిగే అంశాల ఆధారంగా కొంత మెసేజ్ ఇస్తూనే... యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా మలిచారు దర్శకుడు. 
 కథ... కథనాలతో ఎక్కడా బోర్ లేకుండా నలుగురు యువకుల మధ్య జరిగిన సంఘటనలను ఎంతో ఎమోషనల్‌గా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు. ఫస్ట్‌ హాఫ్‌లో రాహుల్ కథతో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ నిచ్చిన దర్శకుడు... ఆ తరువాత ద్వితీయార్థం అంతా ఎమోషనల్‌గా నడిపించి ఆడియన్స్ ని సినిమాలోని మల్టిపుల్ ట్రాక్స్ కి కనెక్ట్ చేయడంలో విజయం సాధించారు.

వర్క్ ప్లేస్‌లో కేవలం అమ్మాయిలకే ప్రాధాన్యం ఇచ్చే ఎంఎన్సీ కంపెనీలు...  అబ్బాయిలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే అమ్మాయిల అభిప్రాయాలను గౌరవించాలనే దానిని ఆదిత్య పాత్రతోనూ, అమ్మాయిలు... అబ్బాయిలకు కారణం లేకుండా బ్రేకప్ చెప్పడం లాంటి వాటిని ఫేస్ చేసే పాత్రలో సంజు పాత్రను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినా... తన ప్రియురాలికి తన ప్రేమను చెప్పలేని పాత్రలో మున్నా పాత్రని ఎంతో ఎమోషనల్‌గా తెరమీద చూపించారు దర్శకుడు. అబ్బాయిలు కూడా అమ్మాయిల్లాగే అన్ని విధాలుగా ఇబ్బందులు అన్నిచోట్లా ఎదుర్కొంటూనే ఉంటారు. వారికి కూడా ఓ వేదిక కావాలి అభిప్రాయాలను పంచుకోవడానికి అనేదానితో తెరకెక్కిన ఈచిత్రం ఆద్యంతం అలరిస్తుంది.

ఎవరెలా చేశారంటే...

ఇందులో నరేష్ అగస్త్య పాత్ర చాలా మంది యువతకు మెసేజ్ ఇస్తుంది. అలాగే కౌషిక్ కూడా కాస్త తన నటనతో మెప్పించాడు. మున్నా పాత్రలో చిత్ర నిర్మాత మౌర్య ఆకట్టుకుంటాడు. గీతా పాత్రలో రియా సుమన్... గ్లామరస్‌గా కనిపించి మెప్పించింది. భార్య బాధితునిగా బ్రహ్మాజీ నవ్వించాడు. బార్‌లో పనిచేసే యువకుని పాత్రలో సుదర్శన్ ఆకట్టుకుంటాడు. వైవా హర్షా చేసిన పాత్ర కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ఇక మిగత పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటాయి. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త కత్తెర పడాల్సింది. సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నాయి. 

Rating:
Advertisement
 
Advertisement