‘లెహరాయి’ నుంచి ‘అప్సరస.. అప్సరస’సాంగ్‌ రిలీజ్‌ | Sakshi
Sakshi News home page

‘లెహరాయి’నుంచి ‘అప్సరస.. అప్సరస’సాంగ్‌ రిలీజ్‌

Published Tue, Sep 27 2022 1:57 PM

Melody Song  Apsarasa Out from Leharaayi Movie - Sakshi

రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్‌గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘లెహరాయి’.  రామకృష్ణ పరమహంస ని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో  మద్దిరెడ్డి శ్రీనివాస్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అప్సరస అప్సరస’ అనే మరో  సాంగ్ ను కూడా విడుద‌ల చేశారు మేకర్స్.

గేయ రచయిత శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్  ఆల‌పించారు.‘తీపితో తేల్చి చెప్పా.. తొలితీపి  నీ పలుకని .. తారనే పిలిచి చూపా ..తొలి తారా నీ నవ్వని’లాంటి  లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నట్లు, మంచి ఫీల్  ఉన్న క‌థతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించినట్లు దర్శకుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస’ తెలిపారు. ఈ చిత్రంలో ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement